Union Budget 2024 | ఆర్థిక లోటు అత్యంత ఆందోళనకరం.. కేంద్ర బడ్జెట్‌పై కాంగ్రెస్ విమర్శ
Union Budget 2024 | కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌ను (Union Budget 2024) కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. ఆర్థిక లోటు అత్యంత ఆందోళనకరంగా ఉందని ఆ పార్టీ నేతలు మండిపడ్డారు.
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌ను (Union Budget 2024) కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. ఆర్థిక లోటు అత్యంత ఆందోళనకరంగా ఉందని ఆ పార్టీ నేతలు మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకుడు మనీష్ తివారీ ద్రవ్యలోటు పెరుగుదలపై ఆందోళన వ్యక్తం చేశారు. ‘అత్యంత ఆందోళన కలిగించే విషయం పెరుగుతున్న ద్రవ్య లోటు. ఎందుకంటే ఆర్థిక మంత్రి సమర్పించిన సంఖ్యలు ఈ సంవత్సరానికి కేంద్ర బడ్జెట్లో 18 లక్షల కోట్లకు పైగా నిధులు ఇవ్వని వాటిగా చూపిస్తున్నాయి. ఈ సంఖ్య మరింత పెరుగనున్నది’ అని అన్నారు.
కాగా, సాధారణంగా ప్రతి కార్యక్రమంలో బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశంసించే రాజకీయ ప్రకటన మాదిరిగా మధ్యంతర బడ్జెట్ ప్రసంగం ఉందని రాజస్థాన్‌కు చెందిన కాంగ్రెస్ నాయకుడు సచిన్ పైలట్ విమర్శించారు. సామాన్యులకు ఎలాంటి ఉపశమనం కలిగించలేదని అన్నారు. రైతులకు, యువకులకు ఎలాంటి ప్రయోజనం లేదన్నారు.
కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు సాధారణ ప్రభుత్వ కార్యకలాపాలు కొనసాగించడానికి అవసరమైన నిధులు
ఉండేలా చూసుకోవడానికి కేవలం పరిపాలనాపరమైన కసరత్తు మాత్రమే మధ్యంతర బడ్జెట్ అని కాంగ్రెస్
ఎంపీ కార్తీ చిదంబరం అన్నారు. అంతకు మించి ఇందులో కొత్త ఏమీ లేదని పెదవి విరిచారు.
On interim Budget 2024, Congress MP Manish Tewari says, "It is a 'vote-on-account' which has only one purpose to keep the government solvent for the first quarter of the current fiscal year. What's worrying is that
there is a budget deficit of Rs 18 lakh crores. This means that… pic.twitter.com/X9Q6JRcS4w— ANI (@ANI) February 1, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

