కోల్‌కతా : అంతరిక్షం గురించి తెలుసుకోవాలనే ఉత్సాహం ఉన్నవారికి శుభవార్త! కోల్‌కతాలోని నేతాజీ నగర్లో ఉన్న ‘ది మ్యూజియం ఆఫ్ ఆస్ట్రానమీ అండ్ స్పేస్ సైన్స్’ను సందర్శించేందుకు ప్రజలకు అవకాశం కల్పించారు. వ్యోమగామి నీల్ అర్మ్స్ట్రాంగ్ తల వెంట్రుకలు, చంద్రుడు, అంగారక శిలలు, 370 కోట్ల సంవత్సరాల క్రితంనాటి బ్యాక్టీరియా శిలాజం వంటివి ఈ మ్యూజియంలో ఉన్నాయి. దీనిని వ్యోమగామి రాకేశ్ శర్మ అక్టోబరులో ప్రారంభించారు. ఇండియన్ సెంటర్ ఫర్ స్పేస్ ఫిజిక్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ సందీప్ కుమార్ చక్రవర్తి మాట్లాడుతూ, శని, ఆదివారాలతోపాటు సెలవు దినాల్లో ఈ మ్యూజియాన్ని సందర్శించవచ్చునని తెలిపారు. పాఠశాలలు 100 టికెట్లను కొంటే, ఒక్కొక్క టికెట్‌పై రూ.20 చొప్పున తగ్గిస్తారు. ఆన్లైన్లో కూడా కొనవచ్చు.