బిల్కిస్ బంధువుల సంబురాలు సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో గుజరాత్లోని దాహోద్ జిల్లా దేవగఢ్ బరియా పట్టణంలో బిల్కిస్ బానో బంధువులు సంబురాలు చేసుకొన్నారు. టీవీల్లో తీర్పు వార్త రాగానే వారంతా టపాసులు పేలుస్తూ ఆనందం వ్యక్తం చేశారు.
సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో కేంద్రం, గుజరాత్ బీజేపీ ప్రభుత్వాలు బిల్కిస్ బానోకు క్షమాపణలు చెప్పాలి. బిల్కిస్ బానో కేసు దోషుల విడుదలకు ఇటు గుజరాత్, అటు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాలు సహకరించాయి. ఈ తీర్పు భవిష్యత్తులో ఎవరైనా లైంగిక దాడులకు పాల్పడితే.. ఏ విధంగానే తప్పించుకొనేందుకు వీలుండదని చెప్పేందుకు ఇది ఉదాహరణగా పనిచేస్తుందని భావిస్తున్నాను. ప్రధాని మోదీ చెప్పే ‘నారీ శక్తి’ మాటలు ఒట్టి బూటకం క్షేత్రస్థాయిలో అది కనిపించదు.
-అసదుద్దీన్ ఒవైసీ, ఎంఐఎం చీఫ్