షీనా బోరా హత్య కేసులో ముగిసిన సీబీఐ దర్యాప్తు
Sheena Bora murder case: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనాబోరా హత్య కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దర్యాప్తు ముగించింది. ఈ విషయాన్ని దర్యాప్తు అధికారులు

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనాబోరా హత్య కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దర్యాప్తు ముగించింది. ఈ విషయాన్ని దర్యాప్తు అధికారులు ప్రత్యేక న్యాయస్థానానికి తెలియజేసినట్లు సీబీఐ వర్గాలు వెల్లడించాయి. 2012లో షీనాబోరా (25) దారుణ హత్యకు గురైంది. ఓ టీవీ ఛానెల్ యజమాని అయిన ఆమె తల్లి ఇంద్రాణి ముఖర్జియా, సవతి తండ్రి పీటర్ ముఖర్జియా ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్నారు.
2015లో వేరే కేసులో ఇంద్రాణి ముఖర్జియా కారు డ్రైవర్ శ్యామ్వర్ రాయ్ అని అరెస్ట్ చేయడంతో హత్య విషయం బయటపడింది. షీనా హత్యలో ఇంద్రాణి ముఖర్జియా, పీటర్ ముఖ్యర్జియాలతోపాటు శ్యామ్వర్ రాయ్ పాత్ర కూడా ఉన్నట్లు తేలింది. దాంతో నిందితులు ముగ్గురిని అరెస్ట్ చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో సీబీఐ ఇప్పటివరకు ఒక ప్రధాన చార్జిషీట్‌తోపాటు రెండు అనుబంధం చార్జిషీట్లను దాఖలు చేసింది. మొత్తం 60 మంది సాక్ష్యులను విచారించింది.
అయితే కేసు దర్యాప్తు ముగిసిన నేపథ్యంలో ప్రొసీజర్ ప్రకారం బాంబే హైకోర్టుకు సీబీఐ అధికారులు దరఖాస్తు చేశారు. కేసు దర్యాప్తు పూర్తయినందున తదుపరి దర్యాప్తును మూసివేస్తున్నట్లు ఆదేశాలు ఇవ్వాలని ఆ దరఖాస్తులో కోరారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- cbi
- Murder Case
- Sheena bora
RELATED ARTICLES
తాజా వార్తలు
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

