Manipur | మణిపూర్‌లో దారుణం.. వ్యక్తి కళ్లకు గంతలు కట్టి, చేతులు కట్టేసి కాల్చి చంపారు
Manipur | మణిపూర్‌లో హింసాత్మక సంఘటనలు కొనసాగుతున్నాయి. ఒక వ్యక్తి కళ్లకు గంతలు కట్టి, చేతులు కట్టేసి పాయింట్ బ్లాంక్ రేంజ్ నుంచి కాల్పులు జరిపి చంపారు. ఇంఫాల్ తూర్పు జిల్లాలో ఈ సంఘటన జరిగింది.
ఇంఫాల్: మణిపూర్‌లో (Manipur) హింసాత్మక సంఘటనలు కొనసాగుతున్నాయి. ఒక వ్యక్తి కళ్లకు గంతలు కట్టి, చేతులు కట్టేసి పాయింట్ బ్లాంక్ రేంజ్ నుంచి కాల్పులు జరిపి చంపారు. ఇంఫాల్ తూర్పు జిల్లాలో ఈ సంఘటన జరిగింది. లామ్లైన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని టెక్చామ్లో శనివారం ఒక వ్యక్తిని దారుణంగా హత్య చేశారని పోలీసులు తెలిపారు. అతడి కళ్లకు గంతలు కట్టి, చేతులు వెనుకకు కట్టి, పాయింట్ బ్లాంక్ రేంజ్ నుంచి కాల్చి చంపారని చెప్పారు. మృతుడ్ని ఆర్కే పృథిబీ సింగ్‌గా గుర్తించినట్లు తెలిపారు. భద్రతా దళాల కోసం గూఢచర్యం చేస్తున్నాడన్న ఆరోపణలతో అతడికి మరణ శిక్ష విధించినట్లు నిషేధిత కేసీపీ (ప్రోగ్రెసివ్) తీవ్రవాద సంస్థ పేర్కొందని పోలీస్ అధికారి అన్నారు. మాజీ మిలిటెంట్ అయిన అతడు లొంగిపోయిన తర్వాత బలగాల కోసం గూఢచర్యం చేస్తున్నాడని ఆ సంస్థ ఆరోపించినట్లు తెలిపారు.
కాగా, కక్చింగ్ జిల్లాలోని తేజ్‌పూర్ మఖా లైకైలో నిషేధిత కేసీపీ(తైబంగన్‌బా)కు చెందిన ఒక తీవ్రవాదిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. 33 ఏళ్ల నింగ్థౌజం ఆశకుమార్ మైతేయి దోపిడీ కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు ఆరోపించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Blindfolded
- Hands Tied
- MAN
- Manipur
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

