Watch: యువతిని వేధించి… రోడ్డుపై ఈడ్చుకెళ్లిన ఆటో డ్రైవర్
అయినప్పటికీ అతడు ఆటోను ఆపలేదు. సుమారు అర కిలోమీటరు దూరం వరకు ఆ యువతిని రోడ్డుపై ఈడ్చుకెళ్లాడు. దీంతో ఆమె రోడ్డుపై పడింది.
ముంబై: ఆటో డ్రైవర్ ఒక యువతిని వేధించాడు. ఆమెను రోడ్డుపై అర కిలోమీటరు దూరం వరకు ఈడ్చుకెళ్లాడు. మహారాష్ట్రలోని థానే నగరంలో ఈ సంఘటన జరిగింది. శుక్రవారం ఉదయం 6.45 గంటలకు 21 ఏళ్ల యువతి నడుచుకుంటూ కాలేజీకి వెళ్తున్నది. రోడ్డు పక్కగా ఉన్న ఆటో డ్రైవర్ ఆమెపై కామెంట్లు చేశాడు. దీంతో ఆ యువతి ఆటో డ్రైవర్‌ను నిలదీసింది. ఈ నేపథ్యంలో ఆటో డ్రైవర్ రెచ్చిపోయాడు. ఆమె చేయి పట్టుకుని వేధించాడు. అనంతరం అతడు అక్కడి నుంచి ఆటోలో పారిపోయేందుకు ప్రయత్నించాడు.
అయితే ఆటో డ్రైవర్‌ను నిలువరించేందుకు ఆ యువతి ప్రయత్నించింది. ఈ క్రమంలో అతడి చేతిని గట్టిగా పట్టుకుంది. అయినప్పటికీ అతడు ఆటోను ఆపలేదు. సుమారు అర కిలోమీటరు దూరం వరకు ఆ యువతిని రోడ్డుపై ఈడ్చుకెళ్లాడు. దీంతో ఆమె రోడ్డుపై పడి గాయపడింది. అంతలో ఆటో డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయాడు.
ఈ సంఘటన అనంతరం ఆ యువతి పోలీసులకు పిర్యాదు చేసింది. దీంతో పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పారిపోయిన ఆటో డ్రైవర్ కోసం వెతుకుతున్నారు. నిందితుడ్ని గుర్తించేందుకు ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
On Camera, Maharashtra College Student Molested, Dragged By Auto Driver https://t.co/2bz01Mkg10 pic.twitter.com/EvNPmrcw7L
— NDTV (@ndtv) October 14, 2022
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

