లఖింపూర్ రైతుల హత్య కేసులో కేంద్ర మంత్రి కుమారుడికి బెయిల్..
Ashish Mishra gets bail: ఆశిష్ మిశ్రాకు బెయిల్ మంజూరీ అయ్యింది. లఖింపూర్ రైతుల హత్య కేసులో ఆయన జైలు శిక్ష అనుభవిస్తున్నారు. 2021లో జరిగిన ఆ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే.
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్‌లో జరిగిన రైతుల హత్య కేసులో కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాకు ఇవాళ సుప్రీంకోర్టు బెయిల్ మంజూరీ చేసింది. 8 వారాల పాటు బెయిల్‌ను ఇస్తున్నట్లు కోర్టు తెలిపింది. 2021లో లఖింపూర్‌లో ధర్నా చేపడుతున్న రైతుల మీదకు ఆశిష మిశ్రా కారు దూసుకెళ్లిన ఘటనలో నలుగురు రైతులు మరణించారు. మర్డర్ కేసు నమోదు చేసి ఆయన్ను పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆశిష్ మిశ్రా జైలులో ఉన్నారు.
బెయిల్ సమయంలో ఆశిష్ మిశ్రా.. యూపీలో కానీ, ఢిల్లీలో కానీ ఉండరాదు అని సుప్రీంకోర్టు ఆదేశించింది. వారం రోజుల్లోగా అతను యూపీని వదిలి వెళ్లాలని కోర్టు తెలిపింది. రైతుల మర్డర్ కేసులో ఆశిష్ మిశ్రా కానీ, అతని కుటుంబసభ్యులు కానీ సాక్ష్యుల్ని ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తే అప్పుడు బెయిల్‌ను రద్దు చేయనున్నట్లు కోర్టు పేర్కొన్నది.
జస్టిస్ సూర్య కాంత్, జేకే మహేశ్వరిలతో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది. బెయిల్ పిటిషన్‌పై మళ్లీ మార్చి 14వ తేదీన కోర్టు విచారణ చేపట్టనున్నది. బెయిల్ సమయంలో ఎక్కడ ఉన్నాడన్న విషయాన్ని ఆశిష్ ఎప్పటికప్పుడు కోర్టుకు తెలియజేయాల్సి ఉంటుంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

