వైరల్ వీడియో | లోకల్ ట్రైన్లో మహిళల గర్బా
నవరాత్రి వేడుకలు ప్రారంభం కావడంతో ఎటుచూసినా పండగ వాతావరణం కనిపిస్తోంది.
ముంబై : నవరాత్రి వేడుకలు ప్రారంభం కావడంతో ఎటుచూసినా పండగ వాతావరణం కనిపిస్తోంది. ముంబై మెరైన్ డ్రైవ్‌లో ఇటీవల మహిళల గర్బా పెర్ఫామెన్స్ పలువురిని ఆకట్టుకోగా తాజాగా కదులుతున్న లోకల్ ట్రైన్లో మహిళల బృందం గర్బా నృత్యం చేస్తున్న మరో వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.
#Garba #Navrathri
MUMBAI LOCALS CREATE MOMENTS
Now in yesterday's 10.02 am #AClocal from Kalyan.
FUN HAS NO LIMIT. pic.twitter.com/Hruzxwbeqr— Mumbai Railway Users (@mumbairailusers) September 28, 2022
ముంబై రైల్వే యూజర్స్ అనే పేజ్ ఈ వీడియోను ట్విట్టర్లో షేర్ చేసింది. కళ్యాణ్ నుంచి వస్తున్న ఓ లోకల్ ట్రైన్లో మహిళలు గర్బా పెర్ఫామ్ చేస్తున్న షార్ట్ క్లిప్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఇతర ప్రయాణీకులు చూస్తుండగా వీరంతా ఎంతో ఉత్సాహంతో డ్యాన్స్ చేస్తుండటం వీడియోలో కనిపించింది.
ఈ పోస్ట్‌కు ముంబై లోకల్స్ క్రియేట్ మొమెంట్స్..ఫన్ హ్యాజ్ నో లిమిట్ అనే క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియో ఆన్లైన్లో షేర్ చేసినప్పటి నుంచి ఇప్పటివరకూ లక్షకు పైగా వ్యూస్ రాబట్టింది. మహిళల స్ఫూర్తిని మెచ్చుకున్న నెటిజన్లు కామెంట్స్ బాక్స్‌లో వారిపై ప్రశంసలు గుప్పించారు. మహిళలు డ్యాన్స్ చేసేందుకు వీలుగా ఇతర మహిళలు వారికి దారిచ్చిన తీరు ప్రశంసనీయమని మరికొందరు కామెంట్ చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- garba
- perform
- Viral video
- women
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

