viral video | బేస్‌బాల్ గేమ్‌లో గాలి దుమారం : బాలుడిని కాపాడిన అంపైర్
ఫ్లోరిడాలో యూత్ బేస్‌బాల్ గేమ్‌లో గాలి దుమారం చెలరేగడంతో తక్షణమే స్పందించిన అంపైర్ ఏడేండ్ల బాలుడిని కాపాడిన వీడియో (viral video) ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
న్యూయార్క్ : ఫ్లోరిడాలో యూత్ బేస్‌బాల్ గేమ్‌లో గాలి దుమారం చెలరేగడంతో తక్షణమే స్పందించిన అంపైర్ ఏడేండ్ల బాలుడిని కాపాడిన వీడియో (viral video) ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జాక్సన్‌విల్లేలోని ఫోర్ట్ కరోలిన్ అథ్లెటిక్ అసోసియేషన్ బేస్‌బాల్ ఫీల్డ్‌లో ఆదివారం మ్యాచ్ జరుగుతుండగా ఈ ఘటన జరిగింది.
వైరల్ వీడియోలో మ్యాచ్ జరుగుతుండగా జోయా అనే బాలుడు సుడిగాలిలో చిక్కుకోవడం కనిపించింది. ఆ సమయంలో బాలుడికి కుడి వైపున నిలుచునిఉన్న అంపైర్ అదిన్ వైల్స్ (17) స్పందించి బాలుడిని గాలి దుమారం నుంచి తప్పించడం చూడొచ్చు. గాలి దుమారం నుంచి బాలుడిని కాపాడిన అంపైర్ అని రెడిట్‌లో షేర్ చేసిన పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చారు.
Umpire Pulls Kid Out of Dust Devil
by u/phleep in interestingasfuck
అనూహ్యంగా గాలి దుమారంలో చిక్కుకోవడంతో దిక్కుతోచని తాను తీవ్ర భయానికి లోనయ్యానని, ఎవరో ఒకరు తనను బయటకు లాగకుంటే తన పరిస్ధితి ఏంటని వణికిపోయానని జోయా చెప్పుకొచ్చాడు. తాను కొద్ది క్షణాలే సుడిగాలిలో చిక్కుకున్నా పదినిమిషాల పాటు ఉన్నట్టుగా అనిపించిందని, ఆ సమయంలో తనకు అసలు ఊపిరి ఆడలేదని బాలుడు గుర్తుచేసుకున్నాడు.
Read More
IPL 2023: వివాదంలో చెన్నై సూపర్ కింగ్స్.. సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- dust devil
- kid
- Saves
- umpire
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Roller | పాలపిట్టను విడుదల చేసిన ఘటనపై కేసు నమోదు
World Cup | ఇండియాలో వరల్డ్ కప్ టోర్నీకి పాకిస్తాన్ దూరం.. జట్టు పర్యటనకు అనుతివ్వని పీసీబీ
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Muskan Rastogi | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. జైలులోనే నిందితురాలు, 10 నెలల కూతురు.. చిన్నారి దత్తత కోరుతూ పిటిషన్
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

