వైరల్ వీడియో | 45 ఏండ్ల తర్వాత నానమ్మను చూసేందుకు వెళ్లాడు..ఆపై..!
చిన్నప్పుడు తనను పెంచిన నానమ్మను చూసేందుకు ఓ వ్యక్తి 45 ఏండ్ల తర్వాత స్పెయిన్ నుంచి బొలీవియా వెళుతూ తన ప్రయాణం, నానమ్మను కలుసుకోవడం అంతటినీ రికార్డు చేశాడు.
న్యూఢిల్లీ : చిన్నప్పుడు తనను పెంచిన నానమ్మను చూసేందుకు ఓ వ్యక్తి 45 ఏండ్ల తర్వాత స్పెయిన్ నుంచి బొలీవియా వెళుతూ తన ప్రయాణం, నానమ్మను కలుసుకోవడం అంతటినీ రికార్డు చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను గుడ్‌న్యూస్ మూవ్మెంట్ తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది.
After more than 45 years apart this man finds his former nanny named Ana. An incredible woman who took care of him as a child as if he were her own son. (🎥:juanitojonsson)
— GoodNewsCorrespondent (@GoodNewsCorres1) September 28, 2022
తాను పసికందుగా ఉన్నప్పుడు తనను పెంచిన నానమ్మ అనా గురించి తెలుసుకున్న వ్యక్తి ఆమెను 45 ఏండ్ల తర్వాత సుదీర్ఘ ప్రయాణం అనంతరం కలుసుకున్న తీరును, ఇద్దరు కలుసుకున్నప్పుడు వారి భావోద్వేగాలను ఈ వీడియో కండ్లకు కట్టింది. తన సొంత కొడుకులానే మనవడిని పెంచిన ఇన్క్రెడిబుల్ విమెన్ అని ఈ వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు.
ఈ వీడియోను వీక్షించిన పలువురు యూజర్లు కామెంట్స్ బాక్స్‌లో తమ రియాక్షన్స్‌ను వెల్లడించారు. ట్విట్టర్లో ఇలాంటి మంచి విషయాలు చూడటం సంతోషకరమని ఓ యూజర్ వ్యాఖ్యానించగా, మా నానమ్మను కనుగొనేందుకు మేం చేసిన ప్రయత్నాలు ఫలించలేదని మరో యూజర్ కామెంట్ చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Bolivia
- MAN
- travels
- Viral video
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

