న్యూఢిల్లీ : సరిహద్దులు చెరిపేసి అందరినీ ఒక్కటి చేసే శక్తి సంగీతానికి ఉంది. ఈ వైరల్ వీడియోను చూసిన వారు ఈ విషయాన్ని ఒప్పుకుని తీరాల్సిందే. ఈ వీడియోలో నేపాలీ మహిళతో కలిసి ఓ విదేశీయురాలు ఆంఖ్ మారీ సాంగ్‌కు హుషారైన స్టెప్స్ వేశారు. ఈ వైరల్ వీడియోను టిక్‌టాక్ నేపాలీ ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేశారు.
ఈ క్లిప్‌లో నేపాల్‌లోని ఓ షాపు వెలుపల ఫారెనర్ తన డ్యాన్స్‌తో దుమ్మురేపుతూ కనిపించారు. ఆమె కిల్లర్ మూవ్మెంట్స్, ఈజ్‌తో కూడిన డ్యాన్స్ పెర్ఫామెన్స్ నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంది. ఆన్లైన్లో షేర్ చేసినప్పటి నుంచి ఈ వీడియోకు ఐదు లక్షల పైగా వ్యూస్ లభించాయి. ఆమె డ్యాన్స్ మూమెంట్స్‌కు ఫిదా అయిన నెటిజన్లు కామెంట్స్ సెక్షన్లో ప్రశంసలు గుప్పించారు. ఆమె డ్యాన్స్ పెర్ఫామెన్స్ అద్భుతమని పలువురు యూజర్లు రాసుకొచ్చారు.