దళితుడికి కర్ణాటక మంత్రి బెదిరింపులు
బీజేపీ నేతలకు దళితులంటే ఎంత చిన్న చూపో అద్దం పట్టే మరో ఘటన ఇది. మొన్నటికిమొన్న గుజరాత్‌లోని ఓ గ్రామంలో దళితులపై సామాజిక బహిష్కరణ విధించడం, నిన్న జార్ఖండ్‌లో ఓ గిరిజన యువతిని బీజేపీ నేత చిత్రహింసలు పెట్టిన ఘటనలు చోటుచేసుకోగా.. తాజాగా ఓ బీజేపీ మంత్రి.. ‘నీ కుటుంబం మొత్తాన్నీ నిప్పు పెట్టి కాల్చి చంపేస్తా’ అని ఓ దళితుడిని
- కుటుంబాన్ని తగులబెడతానని హెచ్చరిక!
- భయపడి బాధితుల ఆత్మహత్యాయత్నం.. మంత్రిపై ఠాణాలో కేసు నమోదు
బెంగళూరు, సెప్టెంబర్ 1: బీజేపీ నేతలకు దళితులంటే ఎంత చిన్న చూపో అద్దం పట్టే మరో ఘటన ఇది. మొన్నటికిమొన్న గుజరాత్‌లోని ఓ గ్రామంలో దళితులపై సామాజిక బహిష్కరణ విధించడం, నిన్న జార్ఖండ్‌లో ఓ గిరిజన యువతిని బీజేపీ నేత చిత్రహింసలు పెట్టిన ఘటనలు చోటుచేసుకోగా.. తాజాగా ఓ బీజేపీ మంత్రి.. ‘నీ కుటుంబం మొత్తాన్నీ నిప్పు పెట్టి కాల్చి చంపేస్తా’ అని ఓ దళితుడిని బెదిరించాడు. ఈ ఘటన బీజేపీపాలిత కర్ణాటకలోని హోస్పేట్ జిల్లాలో జరిగింది.
జిల్లాలోని ఓ గ్రామంలో ఓ వర్గం, పోలప్ప అనే దళితుడి మధ్య కొన్ని రోజులుగా భూ వివాదం నడుస్తున్నది. అయితే, మంగళవారం ఆ గ్రామంలో పర్యటించిన ఆ రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి ఆనంద్‌సింగ్‌ను పోలప్ప భూ వివాదాన్ని పరిష్కరించాలని కోరాడు. ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి.. ‘నీ కుటుంబం మొత్తానికీ నిప్పు పెట్టి కాల్చి చంపేస్తా’ అని బెదిరింపులకు దిగాడు. భయపడ్డ బాధితుడు తన కుటుంబంతో కలిసి హాస్పెట్ రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసి, పోలీస్ స్టేషన్ ఎదుటే కుటుంబంతో సహా నిప్పు పెట్టుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పోలీసులు వారిని రక్షించారు. బెదిరింపులకు దిగిన మంత్రిపై, సూసైడ్‌కు యత్నించిన బాధితులపై కేసు నమోదు చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

