గురువారం 02 ఏప్రిల్ 2020
National - Feb 21, 2020 , 03:25:31

లింగాయత్‌ మఠాధిపతిగా ముస్లిం

లింగాయత్‌ మఠాధిపతిగా ముస్లిం

బెంగళూరు: కర్ణాటకలోని ఓ లింగాయత్‌ మఠానికి ముస్లిం వ్యక్తి అధిపతి అయ్యారు. గడగ్‌ జిల్లాలోని మురుగేంద్ర పౌరనేశ్వర మఠంలో ఈ అరుదైన ఘట్టం ఆవిష్కృతమైం ది. మఠానికి చెందిన గోవింద్‌ భట్‌, బసవేశ్వరుడి బోధనలను విశ్వసించే దివాన్‌ షరీఫ్‌ ముల్లాకు జంధ్యాన్ని ధరింపజేసి మఠం బాధ్యతలను అప్పగించారు. మఠానికి చెంది న కజురి స్వామిజీ కూడా సంప్రదాయం ప్రకారం ఇష్ట లింగాన్ని దివాన్‌కు అందజేశారు. చిత్రదుర్గలోని శ్రీజగద్గురు మురుగరాజేంద్ర మఠానికి చెందిన 361 శాఖల్లో గడగ్‌లోని లింగాయత్‌ మఠం ఒకటి. అక్కడి స్వామీజీల బోధనలకు ఆకర్షితులైన దివాన్‌ షరీఫ్‌ ముల్లా తల్లిదండ్రులు.. ఆ మఠానికి రెండు ఎకరాల భూమిని విరాళంగా ఇచ్చారు. 


ఈ క్రమంలో షరీఫ్‌ కూడా మఠం పట్ల ఆకర్షితు లై.. అందులో చేరారు. తాను మఠం బాధ్యతలు చేపట్టడాన్ని ఎవరూ వ్యతిరేకించలేదని దివాన్‌ షరీఫ్‌ తెలిపారు. బసవ బోధనలను మరింతంగా ప్రచారం చేస్తానని చెప్పా రు. ‘నీ కులం, మతం ఏమిటన్నది ప్రధానం కాదు. దేవు డు చూపిన మార్గాన్ని అనుసరిస్తే మనుషులు సృష్టించిన కులమతాలనేవి అడ్డంకులు కావు’ అని శ్రీ మురుగరాజేంద్ర కొరానేశ్వర స్వామి చెప్పారు. సీఏఏకు వ్యతిరేకంగా ముస్లింలు పోరాడుతున్నవేళ కర్ణాటకలో ఈ ఘటన జరుగడం ప్రాధాన్యం సంతరించుకున్నది. కాగా, గడగ్‌ మఠంలో ఇలాంటివి సాధారణమేనని, గతంలోనూ కొందరు ముస్లింలు జాత్రా కమిటీకి చైర్మన్‌గా వ్యవహరించారని కాంగ్రెస్‌ నేత హెచ్‌కే పాటిల్‌ తెలిపారు. 


logo