న్యూఢిల్లీ: కొవిడ్ సోకినప్పుడు వీర్యం నాణ్యతపై ప్రతికూల ప్రభావం ఉంటున్నదని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఎయిమ్స్ దవాఖాన పరిశోధకులు 19-45 ఏండ్ల మధ్య వయసు గల కొవిడ్ బాధితులపై ఈ అధ్యయనం జరిపారు. వారి వీర్యానికి వివిధ పరీక్షలు చేశారు. తర్వాత 74 రోజులకు మళ్లీ వారి శాంపిళ్లను తీసుకొని అవే పరీక్షలు చేశారు. మొదటిసారి పరీక్షించినప్పుడు స్పెర్మ్ కౌంట్, మొటిలిటీ వంటివి తక్కువగా ఉన్నాయని, రెండో పరీక్ష నాటికి పెరిగినా ఉండాల్సినంత లేవని శాస్త్రవేత్తలు తెలిపారు. వీర్యంలో కరోనా వైరస్ ఆనవాళ్లు లేకపోయినా వీర్య నాణ్యత తక్కువగానే ఉందన్నారు.