భారత్-పాక్ సంబంధాల్లో మార్పు క్షణాల్లో వచ్చేది కాదు: ఆర్మీ చీఫ్
Army Chief MM Naravanae: భారత్-పాకిస్థాన్ మధ్య పరిస్థితులు రాత్రికి రాత్రే మారిపోవని భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణే వ్యాఖ్యానించారు.

న్యూఢిల్లీ: భారత్-పాకిస్థాన్ మధ్య పరిస్థితులు రాత్రికి రాత్రే మారిపోవని భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణే వ్యాఖ్యానించారు. ఇరుదేశాల మధ్య అపనమ్మకం, అనుమానం దశాబ్దాల నుంచి కొనసాగుతున్నదన్నారు. ఇరు దేశాల మధ్య నమ్మకాన్ని ఏర్పర్చుకోవాలంటే పాకిస్థాన్ మన దేశంలోకి ఉగ్రవాదులను పంపించడం మానుకోవాలని, కాల్పుల విరమణ ఒప్పందానికి కట్టుబడి ఉండాలని నవరణె అభిప్రాయపడ్డారు.
నమ్మకాన్ని పెంచుకోవాల్సిన బాధ్యత పూర్తిగా పాకిస్థాన్‌పైనే ఉందని చెప్పారు. నరవణే జమ్ము-కశ్మీర్లో భద్రత పరిస్థితులను గురువారం సమీక్షించారు. ఉగ్రవాదుల చొరబాటు యత్నాలను భగ్నం చేయడానికి తీసుకుంటున్న చర్యలను స్థానిక కమాండర్లు ఆయనకు వివరించారు. అన్ని వేళలా అప్రమ్తంగా, సంసిద్ధంగా ఉన్నందుకు సైనికులను ప్రశంసించారు.
జనరల్ నరవణె ఇటీవల మాట్లాడుతూ.. భారత్‌తో సంత్సంబంధాలను కోరుకుంటే ముందుగా ఉగ్రవాద సంస్థల మౌలిక సదుపాయాలను పాకిస్థాన్ నాశనం చేయాలన్నారు. కాల్పుల విరమణను ఇరు దేశాల సైన్యాలు పాటిస్తుండటం నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) వెంబడి భద్రత విషయంలో మంచి పరిణామమని తెలిపారు. ప్రచ్ఛన్న యుద్ధాన్ని రెచ్చగొట్టే విధానాలను పాకిస్థాన్ విడనాడాలని సూచించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

