న్యూఢిల్లీ, డిసెంబర్ 5: సోమవారం విడుదలైన క్యూఎస్ వరల్డ్ సస్టెయినబులిటీ ర్యాంకింగ్స్-2024లోని టాప్-200లో ఏ భారతీయ ఉన్నత విద్యాసంస్థకు చోటు దక్కలేదు. ఈ ర్యాంకింగ్స్లో యూనివర్సిటీ ఆఫ్ టొరంటో మొదటి స్థానంలో నిలిచింది.
లిస్టులో చోటు దక్కించుకొన్న 56 భారత యూనివర్సిటీలో ఢిల్లీ యూనివర్సిటీ ఉత్తమ ప్రదర్శనతో 220వ స్థానం సంపాదించింది. ఆసియా ఖండం వరకు చూస్తే 30వ ర్యాంకు వచ్చింది. ఇక డీయూ తర్వాత ఐఐటీ బాంబే, ఐఐటీ మద్రాస్ వరుసగా 303, 344 స్థానాల్లో నిలిచాయి. కాగా, యూనివర్సిటీ ఆఫ్ టోరంటో తర్వాత యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, యూనివర్సిటీ ఆఫ్ మాంచెస్టర్ రెండు, మూడు స్థానాలు దక్కించుకొన్నాయి.