లక్నో: ఐఐటీ కాన్పూర్ రామాయణ వెబ్‌సైట్‌ను ఆవిష్కరించింది. ‘వాల్మీకి.ఐఐటీకే.ఏసీ.ఇన్’ పేరుతో వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
నెటిజన్లు వెబ్సైట్లో లాగిన్ అయిన తర్వాత, వాల్మీకి రామాయణంలోని శ్లోకాలు, వాటి అనువాదం పొందవచ్చునని ఐఐటీ కాన్పూర్ ఓ ప్రకటన విడుదల చేసింది. తమ వద్ద ఉన్న సమాచారాన్ని పంపి, వెబ్‌సైట్‌లోని కంటెంట్‌ను ఎడిట్ కూడా చేయవచ్చని తెలిపింది.