ముంబై, నవంబర్ 8: బుధవారం విడుదలైన క్యూఎస్ ఆసియా యూనివర్సిటీ ర్యాంకింగ్స్-2024లో ‘ఐఐటీ బాంబే’ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఆసియా ఖండంలో 40వ ర్యాంకు దక్కించుకొన్నది. 100కు 67.2 స్కోరుతో ఐఐటీ బాంబే ఈ ఘనత సాధించింది. వివిధ ప్రామాణికాంశాల్లో ఐఐటీ బాంబే ఉత్తమ మార్కులు సాధించింది. అకడమిక్ రెప్యూటేషన్(నమ్మకం)లో 83.5, యాజమాన్య రెప్యూటేషన్లో 96, అంతర్జాతీయ రిసెర్చ్ నెట్వర్క్లో 66.3, అంతర్జాతీయ ఫ్యాకల్టీ నిష్పత్తిలో 11.1, పీహెచ్డీ ఉన్న అధ్యాపక సిబ్బంది అంశంలో అయితే 100కు 100 పాయింట్లు సాధించింది.