న్యూఢిల్లీ, ఫిబ్రవరి 2: వాట్సాప్ ప్రైవసీ కావాలంటే ఫేస్బుక్ వాడొద్దని వాట్సాప్ స్పష్టం చేసింది. వాట్సాప్ తరఫున సుప్రీంలో వాదిస్తున్న సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ బుధవారం వాదిస్తూ.. యూజర్లకు చెందిన డాటా కొంతమేరకు మాత్రమే ఫేస్‌బుక్‌తో వాట్సాప్ పంచుకుంటున్నదని చెప్పారు. ఒకవేళ వాట్సాప్ యూజర్లు మరింత ప్రైవసీ కావాలనుకుంటే వారు ఫేస్బుక్ ఖాతాను తొలగించి వాట్సాప్‌ను మాత్రమే వాడాలని సూచించారు.