ICMR | రెండు డోసులు తీసుకున్నా… మాస్క్ విధిగా ధరించాల్సిందే: బలరాం భార్గవ
ICMR | రెండుఒమిక్రాన్ కేసులు దేశంలో ఒక్కసారిగా విజృంభిస్తున్నాయి. 24 గంటల్లోనే కొత్తగా 13 వేల కేసులు నమోదయ్యాయని కేంద్రం

ICMR | రెండుఒమిక్రాన్ కేసులు దేశంలో ఒక్కసారిగా విజృంభిస్తున్నాయి. 24 గంటల్లోనే కొత్తగా 13 వేల కేసులు నమోదయ్యాయని కేంద్రం ప్రకటించింది.ఈ సందర్భంగా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కేంద్రం హెచ్చరించింది. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నా… కచ్చితంగా అందరూ మాస్క్‌ను ధరించాల్సిందేని ఐసీఎంఆర్ డీజీ డాక్టర్ బలరామ్ భార్గవ తేల్చి చెప్పారు. వ్యాక్సినేషన్ పూర్తైందన్న ధీమాలో ఎవరూ ఉండవద్దని, మాస్క్‌ను విధిగా ధరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అలాగే గుంపులు గుంపులుగా గుమిగూడడాన్ని కూడా నిషేధించాలని ఆయన సూచించారు.
కరోనా మొదటి దశలో ఏవైతే ఆంక్షలున్నాయో… ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతున్న ఈ సమయంలోనూ అవే పాటించాలని ఆయన కోరారు. ఇక… హోం ఐసోలేషన్ అనేది మాత్రం అత్యంత అత్యావశ్యకమని ఆయన నొక్కి చెప్పారు. భారత్‌లో సహా ఏ దేశంలో తయారైన వ్యాక్సిన్ అయినా సరే… సంక్రమణను కాస్త తగ్గించే లక్షణాలు కలిగి ఉంటాయి తప్పించి, పూర్తిగా నిరోధించలేవని ఆయన హెచ్చరించారు. అయితే వ్యాధి తీవ్రతను తగ్గించడం, మరణాలను నిరోధించడానికే బూస్టర్ డోస్ అని బలరాం భార్గవ పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

