ముంబై : బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ మోటివేషన్ వీడియోను ఐఏఎస్ అధికారి అవినాష్ శరణ్ ట్విట్టర్లో షేర్ చేశారు. జీవిత సత్యాలను తనదైన శైలిలో అమితాబ్ వెల్లడించిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అక్టోబర్ 16న అమితాబ్ బచ్చన్ వీడియోను అవినాష్ షేర్ చేయగా ప్రస్తుతం ఈ క్లిప్‌ను ఇప్పటికి లక్ష మంది వీక్షించగా పెద్దసంఖ్యలో యూజర్లు షేర్ చేస్తున్నారు.
ఈ వైరల్ వీడియోలో తన తండ్రి తనకు బోధించిన జీవిత సత్యాల గురంచి అమితాబ్ ప్రస్తావించడం కనిపించింది. తండ్రి చెప్పిన విషయాల్లో ముఖ్యంగా “మనం కోరుకున్న విధంగా అన్నీ జరుగుతుంటే మంచిదే..అలా కాకుంటే మరీ మంచిద’ ని చెప్పేవారని గుర్తు చేసుకున్నారు. అప్పట్లో తనకు ఆయన చెప్పింది అర్ధమయ్యేది కాదన్నారు.
అదే విషయం తన తండ్రితో ప్రస్తావిస్తే నువ్వు అనుకున్నట్టు జీవితంలో జరగకుంటే మరేదో దైవిక శక్తికి అనుగుణంగా అవి జరుగుతున్నాయని, ఆ దైవిక శక్తి నీ గురించి ఎన్నడూ చెడుగా ఆలోచించదని విడమరిచి చెప్పారని ఈ క్లిప్‌లో అమితాబ్ చెప్పుకొచ్చారు. జీవితం కొనసాగింనంత కాలం కష్టాలు, పోరాటాలు తప్పవని అన్నారు. ఈ పోస్ట్‌కు లైఫ్ లెసన్ అని అవినాష్ శరణ్ క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియో చాలా స్ఫూర్తిదాయకంగా ఉందని నెటిజన్లు బాలీవుడ్ సూపర్‌స్టార్‌పై ప్రశంసలు గుప్పించారు. ప్రతి ఒక్కరికీ అవసరమైన జీవన పాఠాలు ఇవని ఓ యూజర్ రాసుకురాగా, అమితాబ్ చెప్పింది నూరు శాతం నిజాలని మరో యూజర్ కామెంట్ చేశారు.