Tina Dabi | టీనా దాబి దంపతులకు మగబిడ్డ.. సంబరాల్లో ఐఏఎస్‌ల ఫ్యామిలీ
Tina Dabi | సీనియర్ ఐఏఎస్ అధికారిణి టీనా దాబి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. డెలివరీ కోసం ఇటీవల జైపూర్‌లోని ఓ ఆస్పత్రిలో చేరిన ఆమె శుక్రవారం ప్రసవించారు. దాంతో ఆ కుటుంబం సంబరాలు జరుపుకుంటోంది.
జైపూర్: సీనియర్ ఐఏఎస్ అధికారిణి టీనా దాబి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. డెలివరీ కోసం ఇటీవల జైపూర్‌లోని ఓ ఆస్పత్రిలో చేరిన ఆమె శుక్రవారం ప్రసవించారు. దాంతో ఆ కుటుంబం సంబరాలు జరుపుకుంటోంది. టీనా దాబి భర్త ప్రదీప్ గవాండే 2013 బ్యాచ్ ఐఏఎస్ అధికారి.
దళిత కుటుంబంలో జన్మించిన టీనా దాబి.. 2015 యూపీఎస్సీ ఫలితాల్లో టాప్ ర్యాంకర్‌గా నిలిచారు. సివిల్స్ ఫలితాల్లో టాపర్‌గా నిలిచిన తొలి దళిత మహిళగా రికార్డు దక్కించుకున్నారు. అనంతరం తన బ్యాచ్ ఐఏఎస్ అధికారి అథర్ అమీర్ ఖాన్‌ను టీనా వివాహం చేసుకున్నారు. కానీ, ఇద్దరి మధ్య అభిప్రాయ బేధాలు రావడంతో ఏడాది తర్వాత విడాకులు తీసుకున్నారు.
ఆ తర్వాత ఏడాది క్రితం సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ప్రదీప్ గవాండేను టీనా రెండో పెళ్లి చేసుకున్నారు. ఇద్దరూ ఐఏఎస్ అధికారులే కావడంతో సోషల్ మీడియాలో ఆ జంట పాపులర్ అయ్యింది. ఇప్పుడు ఆ ఇంట్లో పండంటి మగబిడ్డ అడుగు పెట్టింది. దాంతో ఆ ఐఏఎస్‌ల కుటుంబంలో ఆనందానికి అవధులే లేకుండా పోయాయి.
కాగా, ప్రెగ్నెన్నీ కారణంగా టీనా దాబి గత కొన్ని నెలలుగా జైపూర్‌లో నాన్-ఫీల్డ్ పొజిషన్లో విధులు నిర్వహిస్తున్నారు. అంతకుముందు ఆమె జైసల్మేర్ జిల్లా కలెక్టర్‌గా పనిచేశారు. దాంతో జైలస్మేర్ జిల్లాకు తొలి మహిళా కలెక్టర్‌గా టీనా గుర్తింపు పొందారు. దానికి ముందు రాజస్థాన్ ఆర్థికశాఖలో జాయింట్ సెక్రెటరీగా పనిచేశారు.
అయితే, టీనా తొలి వివాహానికి కుటుంబసభ్యులు, స్నేహితులతోపాటు పలువురు రాజకీయ నాయకులు హాజరయ్యారు. కానీ ప్రదీప్ గవాండేతో జరిగిన రెండో వివాహం సింపుల్‌గా జరిగింది. బీఆర్ అంబేద్కర్ చిత్రపటం ముందు టీనా దాబి మెడలో ప్రదీప్ గవాండే తాళి కట్టాడు. కాగా, టీనా దాబికి కొడుకు పుట్టిన సందర్భంగా ఆమె సోదరి రియా దాబి టీనా సీమంతానికి సంబంధించిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Manne krishank | కుంభకోణాలు చేయడం వల్లే రూ.50 వేల కోట్లు దోచుకున్నారు : మన్నె క్రిశాంక్
Symbiosis Professor: మాజీ విద్యార్థినికి అనుచిత మెసేజ్‌లు పంపిన సింబయాసిస్ ప్రొఫెసర్
Manne krishank | మీ పాత్ర లేకపోతే సీబీఐ విచారణ చేపట్టండి.. సీఎం రేవంత్‌కు మన్నె క్రిశాంక్ సవాల్
LK Advani: మెరుగుపడిన ఆరోగ్యం.. ఆస్పత్రి నుంచి ఎల్కే అద్వానీ డిశ్చార్జ్
Netanyahu | అమెరికా భావి అధ్యక్షుడు మనకు శత్రువు కావచ్చు.. భారత్ చిన్న దేశమేమీ కాదు : నెతన్యాహు
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

