Govinda | నా కోసం ప్రార్థించిన అందరికీ ధన్యవాదాలు.. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన నటుడు గోవిందా
Govinda | బాలీవుడ్ (Bollywood) నటుడు (Actor), శివసేన నాయకుడు (Shiv Sena leader) గోవిందా (Govinda) ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తన ఆరోగ్యం మెరుగుపడాలని ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేశారు.
Govinda : బాలీవుడ్ (Bollywood) నటుడు (Actor), శివసేన నాయకుడు (Shiv Sena leader) గోవిందా (Govinda) ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తన ఆరోగ్యం మెరుగుపడాలని ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేశారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి (Maharastra CM) ఏక్నాథ్ షిండే (Eknath Shinde) కు, పోలీసులకు, మీడియాకు, తన అభిమానులకు కృతజ్ఞతలు చెప్పారు.
‘నేను కోలుకోవాలని ప్రార్థిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. సీఎం ఏక్నాథ్ షిండేకు, పోలీసులకు, మీడియాకు కృతజ్ఞతలు. ప్రత్యేకించి నా ఆరోగ్యం కోసం ఎన్నో మొక్కులు మొక్కిన, ప్రేమ చూపిన అభిమానులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు’ అని గోవిందా అన్నారు. కాగా, ప్రమాదవశాత్తు ఇంట్లో గన్ మిస్‌ఫైర్ అయ్యి గోవిందాకు తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబసభ్యులు హుటాహుటిన ఆయనను ముంబైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.
మంగళవారం తెల్లవారుజామున 4:45 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గోవిందా బయటకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న క్రమంలో తన వద్ద ఉన్న లైసెన్స్ గన్ను తనిఖీ చేస్తుండగా మిస్‌ఫైర్ అయ్యింది. అందులోని బుల్లెట్ గోవిందా కాలులోకి దూసుకెళ్లింది. దాంతో ఆయనను వెంటనే ముంబైలోని క్రిటీ కేర్ ఆసుపత్రికి తరలించారు. మూడు రోజుల చికిత్స అనంతరం కోలుకోవడంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు.
#WATCH | Mumbai: Actor and Shiv Sena leader Govinda says, “I thank everyone for their prayers… I thank CM Shinde, police and the press. I especially thank my fans for praying so much for me. I thank them from the bottom of my heart for their love.” https://t.co/O5nWBbUz9G pic.twitter.com/nsmcxMPoCi
— ANI (@ANI) October 4, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

