డోలో లంచం 1000 కోట్లు!
- పేషంట్లకు ఇదే మందును రాయాలంటూ డాక్టర్లకు నజరానాలు
- డోలో-650 తయారీ సంస్థ మైక్రో ల్యాబ్స్ ‘అనైతిక చర్య’
- దర్యాప్తు జరపాలంటూ ఫార్మసీ విభాగానికి కేంద్రం ఆదేశాలు
న్యూఢిల్లీ, జూలై 15: కరోనా పుణ్యమా అని దేశంలో ప్రతి ఒక్కరికి బాగా తెలిసిన మందుల్లో ముందు వరుసలో ఉంటుంది డోలో-650. అయితే ఆ మందులను అమ్మేందుకు తయారీదారులు తీవ్రమైన అనైతిక చర్యలకు పాల్పడ్డారని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) పేర్కొన్నది. తమ బ్రాండ్‌ను ప్రచారం చేసుకునేందుకు దేశవ్యాప్తంగా ఉన్న డాక్టర్లకు ఏకంగా రూ.1000 కోట్ల విలువైన ‘బహుమతులు’, ప్రయాణ ఖర్చులను అందజేసినట్టు స్పష్టం చేసింది. ఈ అనైతిక చర్యలకు పాల్పడిన కంపెనీపై విడిగా, ప్రత్యేకమైన దర్యాప్తు జరపాలని కేంద్ర కెమికల్స్, ఫర్టిలైజర్స్ శాఖ.. ఫార్మాసుటికల్ డిపార్ట్మెంట్ను ఆదేశించింది. ఆదాయ పన్నుల శాఖ సోదాల్లో కంపెనీలో లభించిన డాక్టర్ల వివరాలు గుర్తించి వారికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని స్పష్టం చేసింది.
బయట పడిందిలా..
బెంగళూరుకు చెందిన మైక్రోల్యాబ్స్ లిమిటెడ్ ఈ డోలో-650 తయారు చేస్తుంటుంది. ఈ కంపెనీకి చెందిన 36 ప్రాంతాలపై జూలై 6న ఆదాయ పన్నుల శాఖ ఏకకాలంలో దాడులు జరుపడంతో ఈ బండారం బయటపడింది. దాడుల్లో దీనికి సంబంధించిన ఆధారాలను గుర్తించి సీజ్ చేశారు. అయితే సీబీడీటీ నివేదికలో నేరుగా మైక్రోల్యాబ్స్ పేరు కానీ, డోలో-650 పేరు కానీ ఎక్కడా ప్రస్తావించలేదు. అయితే విశ్వసనీయ వర్గాల ప్రకారం ఆ కంపెనీ మైక్రోల్యాబ్ అని స్పష్టమవుతున్నది. ఈ బహుమతులను మందుల ప్రచారానికి వాడుకున్నట్టు అకౌంట్స్ బుక్స్‌లో ‘సేల్స్ అండ్ ప్రమోషన్’ కింద పొందుపరిచారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

