Congress office | కాంగ్రెస్ ఆఫీస్‌లో నల్లాల దొంగతనం.. వెళ్తూవెళ్తూ ‘ఐ లవ్ యూ’ అని రాసిన దొంగలు
Congress office | ఛత్తీస్‌గఢ్ (Chattishgarh) లోని అంబికాపూర్ (Ambikapur) లో ఓ వింత దొంగతనం వెలుగు చూసింది. నగరంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ (Congress Party) కార్యాలయంలోకి చొరబడిన దొంగలు బాత్రూమ్లోని దాదాపు 72 స్టీల్ నల్లాలను (Taps) ఎత్తుకెళ్లారు.
Congress office : ఛత్తీస్‌గఢ్ (Chattishgarh) లోని అంబికాపూర్ (Ambikapur) లో ఓ వింత దొంగతనం వెలుగు చూసింది. నగరంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ (Congress Party) కార్యాలయంలోకి చొరబడిన దొంగలు బాత్రూమ్లోని దాదాపు 72 స్టీల్ నల్లాలను (Taps) ఎత్తుకెళ్లారు. అంతటితో ఆగకుండా వెళ్లేటప్పుడు నేలపై ‘ఐ లవ్ యూ అంబికాపూర్ (I Love You Ambikapur)’ అని రాయడం చర్చనీయాంశంగా మారింది.
గాంధీ చౌక్ సమీపంలో ఉన్న కాంగ్రెస్ కార్యాలయంలో ఈ ఘటన జరిగింది. నగరంలో అత్యంత రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఇదొకటి. గతకొన్ని రోజులుగా ఈ ఆఫీసులో దొంగతనం జరగడం ఇది మూడోసారి. ఈ ఘటనపై కాంగ్రెస్ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. దొంగలు ప్రేమ సందేశం రాశారంటే నగరంలోని శాంతిభద్రతలను ఎగతాళి చేయడమేనని వారు మండిపడ్డారు.
పోలీసుల రాత్రి పెట్రోలింగ్ కేవలం కాగితాలకే పరిమితమైందని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బాలకృష్ణ పాఠక్ విమర్శించారు. రద్దీ ప్రాంతంలో ఉన్న ప్రధాన పార్టీ ఆఫీసుకే భద్రత లేకపోతే సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. డ్రగ్స్‌కు బానిసైనవారి పని అయ్యుంటుందని అనుమానం వ్యక్తంచేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

