Rajasthan | కోటాలో విద్యార్థి అదృశ్యం.. ఐదేళ్లపాటు ఇంటికి దూరంగా వెళ్లిపోతున్నా అంటూ తండ్రికి మెసేజ్
Rajasthan | Rajasthan | ఉన్నత చదువులు, ఉద్యోగాల కోచింగ్‌కు ప్రసిద్ధిగాంచిన రాజస్థాన్ (Rajasthan) కోటా (Kota)లో తాజాగా మరో విద్యార్థి అదృశ్యమయ్యాడు. ఐదేళ్ల పాటు ఇంటికి దూరంగా వెళ్లిపోతున్నానంటూ తల్లిదండ్రులకు మెసేజ్ చేసి మరీ వెళ్లిపోయాడు.
Rajasthan | ఉన్నత చదువులు, ఉద్యోగాల కోచింగ్‌కు ప్రసిద్ధిగాంచిన రాజస్థాన్ (Rajasthan) కోటా (Kota)లో విద్యార్థుల ఆత్మహత్య (Prevent Suicides)లు, అదృశ్యాలు కలకలం రేపుతున్నాయి. ఒత్తిడి కారణంగా ఇప్పటికే పలువురు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా మరో విద్యార్థి ఎవరికీ కనిపించకుండా వెళ్లిపోవడం తీవ్ర కలకలం రేపుతోంది (Kota Student Goes Missing). ఐదేళ్ల పాటు ఇంటికి దూరంగా వెళ్లిపోతున్నానంటూ తల్లిదండ్రులకు మెసేజ్ చేసి మరీ వెళ్లిపోయాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గంగారాంపూర్‌లోని బమన్‌శాస్‌కు చెందిన 19 ఏళ్ల రాజేంద్ర మీనా (Rajendra Meena) కోటాలో మెడికల్ ప్రవేశ పరీక్ష నీట్‌కు (NEET) సిద్ధమవుతున్నాడు. స్థానికంగా ఉన్న ఓ హాస్టల్లో ఉంటూ కోచింగ్ క్లాస్‌లకు హాజరవుతున్నాడు. ఈ క్రమంలో ఈనెల 6వ తేదీన అతడు అదృశ్యమయ్యాడు. మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో తాను ఉంటున్న పీజీని ఖాళీ చేసి వెళ్లిపోయాడు.
వెళ్లిపోయేముందు రాజేంద్ర మీనా తన తండ్రి జగదీశ్ మీనాకు ఓ సందేశం పంపాడు. ‘నేను ఐదేళ్ల పాటు ఇంటి నుంచి వెళ్లిపోతున్నాను. నా చదువును కొనసాగించాలని అనుకోవడం లేదు. ఇప్పుడు నా వద్ద రూ.8 వేలు ఉన్నాయి. ఫోన్ కూడా అమ్మేస్తున్నాను. నా వద్ద ఉన్న సిమ్‌ను కూడా తీసేస్తున్నా. అమ్మకు చెప్పండి నా గురించి చింతించొద్దని. నేను ఎలాంటి రాంగ్ స్టెప్ తీసుకోను. అందరి నంబర్లూ నా దగ్గర ఉన్నాయి. అవసరమైతే తప్పకుండా కాల్ చేస్తా. ఏడాదికి ఓసారి కచ్చితంగా ఫోన్ చేస్తా’ అని తన తండ్రికి సందేశం పంపించాడు.
కుమారుడి నుంచి వచ్చిన మెసేజ్ చూసి కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. వెంటనే అతడి కోసం గాలింపు చేపట్టారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. జగదీశ్ మీనా ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు విద్యార్థి ఆచూకీ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.
Also Read..
Vistara | విమానం వాష్‌రూమ్‌లో పొగతాగి.. కటకటాలపాలైన ప్రయాణికుడు
Rahul Gandhi | అది మీ వ్యక్తిగత అనుభవమా?.. అంబానీ, అదానీ అంశంలో మోదీకి రాహుల్ కౌంటర్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్‌లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్‌బండ్‌పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

