Ashok Chavan: సోనియా గాంధీని కలవలేదు.. రాహుల్ గాంధీ వ్యాఖ్యలు నిరాధారం : అశోక్ చవాన్
Ashok Chavan: కాంగ్రెస్ పార్టీని వీడడానికి ముందు తానేమీ సోనియా గాంధీని కలవలేదని బీజేపీ ఎంపీ అశోక్ చవాన్ తెలిపారు. సోనియాను కలిసినట్లు రాహుల్ చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుపట్టారు
ముంబై: కాంగ్రెస్ పార్టీని వీడడానికి ముందు తానేమీ సోనియా గాంధీని కలవలేదని బీజేపీ ఎంపీ అశోక్ చవాన్(Ashok Chavan) తెలిపారు. సోనియాను కలిసినట్లు రాహుల్ చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుపట్టారు. ఆదివారం ముంబైలో జరిగిన మీటింగ్‌లో రాహుల్ మాట్లాడుతూ.. మహారాష్ట్రకు చెందిన ఓ నేత తన తల్లి ముందు ఏడ్చేశాడని, ఇక ఆ శక్తితో పోరాడలేనని, జైలుకు వెళ్లాలని లేదని ఆ నేత చెప్పినట్లు రాహుల్ పేర్కొన్నారు. ఆ వ్యాఖ్యలకు అశోక్ చవాన్ కౌంటర్ ఇచ్చారు. రాహుల్ గాంధీ తన ప్రసంగంలో ఎవరి పేరును ప్రస్తావించలేదని అశోక్ చవాన్ తన వీడియో సందేశంలో తెలిపారు. ఒకవేళ తన పేరును ప్రస్తావిస్తే, అప్పుడు ఆ వ్యాఖ్యలు అర్థరహితం, నిరాధారమని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసే వరకు తాను పార్టీ ప్రధాన కార్యాలయంలో పనిచేసినట్లు చెప్పారు. ముందుగా ఎమ్మెల్యే పోస్టుకు రాజీనామాచేసి ఆ తర్వాత పార్టీకి కూడా రిజైన్ చేసినట్లు తెలిపారు. తన రాజీనామా గురించి చివరి నిమిషం వరకు ఎవరికీ తెలియదని మాజీ సీఎం అన్నారు. తానెప్పుడూ సోనియా గాంధీని కలవలేదన్నారు. ఎన్నికల వేళ రాహుల్ రాజకీయ వ్యాఖ్యలు చేసినట్లు గుర్తు చేశారు. కాంగ్రెస్‌ను వీడిన తర్వాత అశోక్ చవాన్ బీజేపీలో చేరారు. ఆ పార్టీ ఆయన్ను రాజ్యసభకు నామినేట్ చేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

