e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, January 18, 2022
Home News కంగ‌నా బుగ్గ‌ల్లా జ‌మ్తారా రోడ్లు.. కాంగ్రెస్ ఎమ్మెల్యే వ్యాఖ్య‌లు

కంగ‌నా బుగ్గ‌ల్లా జ‌మ్తారా రోడ్లు.. కాంగ్రెస్ ఎమ్మెల్యే వ్యాఖ్య‌లు


రాంచి: రోడ్ల‌ను హీరోయిన్‌ల బుగ్గ‌ల‌తో పోల్చ‌డం రాజ‌కీయ నాయ‌కుల‌కు అల‌వాటుగా మారింది. తాజాగా మ‌రో నేత అదేరీతి వ్యాఖ్య‌లు చేశారు. జార్ఖండ్ రాష్ట్రంలోని జ‌మ్తారా నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్యే ఇర్ఫాన్ అన్సారీ.. త‌న నియోజ‌క‌వ‌ర్గంలోని రోడ్ల‌న్నీ ఇక ముందు బాలీవుడ్ హీరోయిన్ కంగ‌నా ర‌నౌత్ బుగ్గ‌ల్లా నున్న‌గా ఉంటాయ‌ని వ్యాఖ్యానించారు. ఈ మేర‌కు 14 వ‌ర‌ల్డ్ క్లాస్ ర‌హ‌దారుల నిర్మాణం త్వ‌ర‌లో ప్రారంభం కానుంద‌ని చెప్పారు.

ఈ వ్యాఖ్య‌లను ఆయ‌న ఏ స‌మావేశంలోనో, బ‌హిరంగ స‌భ‌లోనో, ప్రెసెమీట్‌లోనో చేయ‌లేదు. త‌న ఇంట్లో కూర్చుని సెల్ఫీ వీడియో తీసుకుంటూ చెప్పారు. అనంత‌రం ఈ వీడియోను ట్విట్ట‌ర్‌లో పోస్టు చేశారు. ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఎమ్మెల్యే వ్యాఖ్య‌ల‌పై నెటిజ‌న్‌ల నుంచి ర‌క‌ర‌కాల స్పంద‌న‌లు వ‌స్తున్నాయి. ఓ నెటిజ‌న్.. భ‌ర్త‌ను భార్య చెప్పుతో కొడుతున్న ఫొటోలు పెట్టి కంగ‌నా వీడియో చూసిందంటే ఎమ్మెల్యే ప‌రిస్థితి ఇదే అని కామెంట్ చేశాడు.

- Advertisement -

రోడ్లు మ‌రీ అంత నున్న‌గా ఉంటే యాక్సిడెంట్‌లు అవుతాయ‌ని మ‌రికొంద‌రు నెటిజ‌న్‌లు వ్యాఖ్యానించారు. రోడ్లు కంగ‌నా బుగ్గ‌ల్లాగే ఎందుకుండాలె.. నీ చెల్లెలు బుగ్గ‌ల్లా కూడా ఉండ‌వ‌చ్చుగా..? మ‌రో నెటిజ‌న్ ప్ర‌శ్నించాడు. హీరోయిన్‌ల బుగ్గ‌ల గురించి మాట్లాడ‌టానికి ముందు నీ త‌ల్లి, చెల్లి బుగ్గ‌ల గురించి మాట్లాడు అని ఇంకొంద‌రు నెటిజ‌న్లు మండిప‌డ్డారు.

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement