ఇక హెరిటేజ్ రూట్లలో పరుగులు పెట్టనున్న హైడ్రోజన్ రైళ్లు
హెరిటేజ్ రూట్లలో హైడ్రోజన్ రైళ్లను ప్రవేశపెట్టడం ద్వారా దేశ లోకోమోటివ్ మొబిలిటీ రూపురేఖలు మార్చనున్నట్టు రైల్వేలు ప్రకటించాయి. 2023 ద్వితీయార్ధంలో ఈ ప్రక్రియ ప్రారంభమవుతుందని భారతీయ రైల్వేలు వెల్లడించాయి.
న్యూఢిల్లీ : హెరిటేజ్ రూట్లలో హైడ్రోజన్ రైళ్లను ప్రవేశపెట్టడం ద్వారా దేశ లోకోమోటివ్ మొబిలిటీ రూపురేఖలు మార్చనున్నట్టు రైల్వేలు ప్రకటించాయి. ఈ రైళ్లలో విస్టాడోమ్ కోచ్‌లతో పాటు ప్రతి కోచ్‌లోనూ ప్రపల్షన్ యూనిట్‌ను ఏర్పాటు చేస్తారు. 2023 ద్వితీయార్ధంలో ఈ ప్రక్రియ ప్రారంభమవుతుందని భారతీయ రైల్వేలు వెల్లడించాయి. చైనా తన తొలి హైడ్రోజన్ ట్రైన్‌ను లాంఛ్ చేసిన కొద్దిరోజులకే రైల్వేలు ఈ ప్రకటన చేయడం గమనార్హం.
రాబోయే రోజుల్లో గ్రీన్ హైడ్రోజన్ వాడకాన్ని ముమ్మరంగా చేపట్టే క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. గ్రీన్ హైడ్రోజన్ రంగంలో గ్లోబల్ హబ్‌గా భారత్ ఎదిగేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. హెరిటేజ్ కోసం హైడ్రోజన్ ప్రణాళికతో రైళ్ల టెక్నాలజీ, రూపురేఖలు, ఆపరేటింగ్ సిస్టం మారడమే కాకుండా ప్రజా రవాణా వ్యవస్ధలో గ్రీన్ ఎనర్జీని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తుందని భావిస్తున్నారు.
ఇక ఈ హైడ్రోజన్ ట్రైన్లను నారో గేజ్‌తో పాటు, మీటర్ గేజ్పైనా ప్రవేశపెట్టే వెసులుబాటు ఉంది. ఎనిమిది హెరిటేజ్ రూట్లలో హైడ్రోజన్ ట్రైన్లను ప్రవేశపెట్టనున్నారు. 19.97 కి.మీ పొడవైన మథెరన్ హిల్ రైల్వే, 88.6 కి.మీ పొడవైన డార్జలింగ్ హిమాలయన్ రైల్వే, కల్క-సిమ్లా రైల్వే, కంగ్రా వ్యాలీ రైల్వే, బిల్మోరా వఘై రూట్, మో పటల్పానీ, నీలగిరి మౌంటెన్ రూట్, మర్వార్ దేవ్ఘఢ్ మద్రియ రూట్లలో హెరిటేజ్ రైళ్లను ప్రవేశపెట్టేందుకు రైల్వేలు ప్రణాళికలు సిద్ధం చేశాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shamonda Virus: షామోండా వైరస్‌తో మనుషులకు, పశువులకు రిస్క్ ఏంటి ?
Prabhas | జపాన్‌లోనూ డార్లింగ్ మానియా .. తెలుగులో విషెస్ చెప్పిన విదేశీ అభిమానులు
Multi Starrer | 40 ఏళ్ల నిరీక్షణకు తెర పడనుందా .. రజినీకాంత్–కమల్ హాసన్‌తో నెల్సన్ భారీ మల్టీస్టారర్!
Scene | సూర్య ‘సీన్’ చిత్రంలో విలన్‌గా నస్లేన్.. గ్లింప్స్ విడుదల!
The Paradise | విమర్శలు ఎదురైన తగ్గేదేలే.. నెట్‌ఫ్లిక్స్‌లో నంబర్ వన్‌గా ‘ది ప్యారడైజ్’, నాని ఖాతాలో మరో రికార్డు!
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

