రెండో ప్రయోగానికి స్కైరూట్ సిద్ధం!
భారత అంతరిక్ష రంగంలో ప్రైవేట్ సంస్థల దూకుడు పెరుగుతున్నది. హైదరాబాద్‌కు చెందిన స్కైరూట్ ఏరో స్పేస్ తన విక్రమ్-1 రాకెట్ రెండో ప్రయోగానికి సన్నాహాలు వేగవంతం చేసింది.
- కీలక ఇంజిన్ పరీక్ష సక్సెస్.. డిసెంబర్లో నింగిలోకి!
హైదరాబాద్ : భారత అంతరిక్ష రంగంలో ప్రైవేట్ సంస్థల దూకుడు పెరుగుతున్నది. హైదరాబాద్‌కు చెందిన స్కైరూట్ ఏరో స్పేస్ తన విక్రమ్-1 రాకెట్ రెండో ప్రయోగానికి సన్నాహాలు వేగవంతం చేసింది. ఇందులో భాగంగా రాకెట్లో అత్యంత కీలకమైన రామన్-1 థ్రస్టర్ ఇంజిన్‌ను విజయవంతంగా పరీక్షించింది. దీంతో రెండో ప్రయోగానికి సంబంధించిన కీలక అడ్డంకిని అధిగమించినట్లయ్యింది. విక్రమ్-1 రాకెట్ ప్రయాణంలో రామన్-1 థ్రస్టర్ ప్రత్యేక పాత్ర పోషిస్తుంది. సాధారణంగా రాకెట్‌ను పైకి నడిపించే ప్రధాన ఇంజిన్లకు భిన్నంగా ఇది రాకెట్ దిశను నియంత్రిస్తుంది.
ముఖ్యంగా రాకెట్ తన పొడవైన అక్షం చుట్టూ తిరిగే రోల్ కదలికను నియంత్రిస్తుంది. తద్వారా ప్రయాణ సమయంలో రాకెట్‌ను సరైన దిశలో ఉంచడంతో పాటు నిర్దేశిత మార్గంలో పయనించేందుకు సహాయపడుతుంది. రామన్-1 పరీక్షలన్నీ పూర్తయ్యాయని స్కైరూట్ ప్రకటించింది. రెండో ప్రయోగానికి అవసరమైన ఏర్పాట్లను సంస్థ ఇప్పటికే ప్రారంభించింది. తదుపరి విక్రమ్-1 రాకెట్‌కు సంబంధించిన మొద టి దశ హార్డ్‌వేర్‌ను సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రానికి తరలించింది. అక్కడ రాకెట్ విడిభాగాల అనుసంధానం, ఇతర సాంకేతిక పరీక్షలు కొనసాగుతున్నాయి.
2026 డిసెంబర్లో లేదా 2027 జనవరి ప్రారంభంలో విక్రమ్-1 రెండో ప్రయోగాన్ని నిర్వహించాలని స్కైరూట్ లక్ష్యంగా పెట్టుకుంది. మూడో ప్రయోగం నుంచి పూర్తిస్థాయి వాణిజ్య ప్రయోగాలను ప్రారంభించాలని కంపెనీ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. జూలై 18న విక్రమ్-1 తన తొలిప్రయోగం ‘మిషన్ ఆగమన్’లో విజయవంతం అయ్యింది. భూమికి సుమారు 450 కిలోమీటర్ల ఎత్తులోని ఎర్త్ ఆర్బిట్‌లోకి చేరుకుని, తన పేలోడ్లను నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. దీంతో కక్ష్యస్థాయి రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించిన తొలి ప్రైవేట్ సంస్థగా స్కైరూట్ ఏరోస్పేస్ చరిత్ర సృష్టించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

