ఆల్మట్టికి పోటెత్తిన వరద.. జూరాలకు చేరుతున్న నీరు
ఆల్మట్టి| కర్ణాటకలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఆల్మట్టికి డ్యాంకు వరద పోటెత్తుతున్నది. ఎగువన విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో ప్రాజెక్టులోకి 81,944 క్యూసెక్కుల వరద వస్తున్నది. జలాశయం పూర్తిస్థాయి నీటినిల్వ 123.08 టీఎంసీలు.

హైదరాబాద్: కర్ణాటకలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఆల్మట్టికి డ్యాంకు వరద పోటెత్తుతున్నది. ఎగువన విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో ప్రాజెక్టులోకి 81,944 క్యూసెక్కుల వరద వస్తున్నది. జలాశయం పూర్తిస్థాయి నీటినిల్వ 123.08 టీఎంసీలు. ప్రస్తుతం ప్రాజెక్టులో 93.125 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. ఆల్మట్టి దిగువన ఉన్న నారాయణపూర్ ప్రాజెక్టుకు 55 వేల క్యూసెక్కుల వరద వచ్చిచేరుతున్నది. దీంతో తొమ్మిది గేట్లు ఎత్తి 57,120 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ 33.31 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 30.47 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది.
నారాయణపూర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తివేయడంతో దిగువన ఉన్న జూరాలకు ప్రస్తుతం 5500 క్యూసెక్కుల నీరు వస్తున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

