ఆధార్‌కార్డుపై ఫొటోను మార్చుకోండిలా..!
Adhaar Card Photo: ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో ఏ పని జరుగాలన్నా ఇప్పుడు ఆధార్‌కార్డును తప్పనిసరిగా చూపించాల్సిందే. అయితే, ఆధార్‌కార్డుపై దిగిన ఫొటోలు

న్యూఢిల్లీ: మనిషి వ్యక్తిగత గుర్తింపునకు ఇప్పుడు ఆధార్‌కార్డు తప్పనిసరయ్యింది. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో ఏ పని జరుగాలన్నా ఇప్పుడు ఆధార్‌కార్డును తప్పనిసరిగా చూపించాల్సిందే. అయితే, ఆధార్‌కార్డుపై దిగిన ఫొటోలు కొన్నేండ్ల తర్వాత మనమేనా..? కాదా.. అనే సందేహం కలిగేలా ఉంటున్నాయి. ఎందుకంటే ఏటికేడు మనిషి రూపులో మార్పు వస్తుంది. కానీ ఫొటోల్లో మార్పు ఉండదు. కాబట్టి ఆధార్‌కార్డుపై ఉన్న ఫొటోకు మనకు ఏమాత్రం పోలికలు కనిపించవు. దాంతో మన పనులు నిలిచేపోయే ప్రమాదం ఉన్నది. ఈ సమస్యకు పరిష్కారం కోసం ఆధార్‌కార్డుపై ఉన్న ఫొటోను మార్చుకోవడం ఒకటే మార్గం. మరి అదెలాగో తెలుసుకుందామా..?
- ఆధార్‌కార్డుపై ఫొటోను మార్చుకోవాలంటే ముందుగా uidai.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
- అనంతరం ఆ వెబ్సైట్ నుంచి ఒక ఆధార్ ఎన్రోల్మెంట్ ఫామ్‌ను డౌన్లోడ్ చేసుకుని పూరించాలి.
- ఆ తర్వాత పూరించిన ఫామ్‌ను సమీపంలోని ఆధార్ నమోదు కేంద్రంలో సమర్పించాలి.
- అనంతరం సంబంధిత రుసుము చెల్లిస్తే ఆధార్ కేంద్రంలోని ప్రతినిధి మీ ఫొటోను తీసి ఆధార్‌కార్డుపై అప్లోడ్ చేస్తారు.
- ఆ తర్వాత ఫొటోను మార్చినట్లుగా ఆధార్ కేంద్రం ప్రతినిధి మీకొక అకనాలెడ్జ్ స్లిప్ ఇస్తారు. ఆ స్లిప్పై ఉన్న నంబర్ ద్వారా మీ ఆధార్‌కార్డుపై ఫొటో అప్డేట్ అయిన విషయాన్ని తెలుసుకోవచ్చు.
- ఒకసారి ఆధార్‌కార్డుపై ఫొటో అప్డేట్ అయినట్లు రుజువు కాగానే అధికారిక వెబ్‌సైట్‌ను తెరిచి కొత్త ఆధార్‌కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

