Cop Shoots Bride | మేకప్ కోసం బ్యూటీ పార్లర్‌కు వెళ్లిన వధువు.. గన్‌తో కాల్పులు జరిపిన పోలీస్
Cop Shoots Bride | మేకప్ కోసం బ్యూటీ పార్లర్‌కు వెళ్లిన వధువుపై ఒక పోలీస్ గన్‌తో కాల్పులు జరిపాడు (Cop Shoots Bride). అనంతరం తనను తాను కాల్చుకునేందుకు ప్రయత్నించాడు. పార్లర్ సిబ్బంది అడ్డుకోవడంతో అక్కడి నుంచి పారిపోయాడు.
పాట్నా: మేకప్ కోసం బ్యూటీ పార్లర్‌కు వెళ్లిన వధువుపై ఒక పోలీస్ గన్‌తో కాల్పులు జరిపాడు (Cop Shoots Bride). అనంతరం తనను తాను కాల్చుకునేందుకు ప్రయత్నించాడు. పార్లర్ సిబ్బంది అడ్డుకోవడంతో అక్కడి నుంచి పారిపోయాడు. బీహార్‌లోని ముంగేర్‌లో ఈ సంఘటన జరిగింది. తారాపూర్ డయారాలోని మహేశ్‌పూర్ ప్రాంతానికి చెందిన 26 ఏళ్ల అపూర్వ కుమారికి ఆదివారం ఒక వ్యక్తితో పెళ్లి జరుగాల్సి ఉంది. దీంతో ఆ వధువు మేకప్ కోసం బ్యూటీ పార్లర్‌కు వెళ్లింది. పెళ్లి కోసం ఆమె ముస్తాబుతున్నది.
కాగా, ఒక వ్యక్తి ఆ వధువు వెనుకే ఆ బ్యూటీ పార్లర్‌కు చేరుకున్నాడు. వివాహం కోసం మేకప్ వేసుకుని సిద్ధమవుతున్న అపూర్వ కుమారిని వెనుక నుంచి పిస్టల్‌తో కాల్పులు జరిపాడు. దీంతో ఒక బుల్లెట్ ఆమె కుడి భుజం నుంచి దూసుకెళ్లి ఛాతీ నుంచి బయటకు వచ్చింది. ఆ తర్వాత ఆ గన్‌తో తనను తాను కాల్చుకునేందుకు అతడు ప్రయత్నించాడు. బ్యూటీ పార్లర్ సిబ్బంది అడ్డుకోవడంతో అక్కడి నుంచి పారిపోయాడు.
మరోవైపు గన్ కాల్పుల్లో గాయపడిన వధువు అపూర్వ కుమారిని వెంటనే హాస్పిటల్‌కు తరలించారు. అయితే ఆమె ప్రాణాలకు ఎలాంటి ముప్పు లేదని డాక్టర్లు తెలిపారు. పెళ్లికుమార్తె తండ్రి ఫిర్యాదుతో ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆ బ్యూటీ పార్లర్ వద్దకు చేరుకుని పరిశీలించారు. ఒక పిస్టల్, వినియోగించిన బుల్లెట్‌ను స్వాధీనం చేసుకున్నారు. జరిగిన సంఘటన గురించి పార్లర్ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. కాల్పులు జరిపిన వ్యక్తి వధువు కుటుంబానికి చెందినవాడిగా తాము భావించినట్లు వారు చెప్పారు.
కాగా, ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలించారు. పెళ్లికుమార్తె అపూర్వ కుమారిపై కాల్పులు జరిపిన నిందితుడు పాట్నాలో పోలీస్‌గా పని చేస్తున్న అమన్ కుమార్‌గా గుర్తించారు. పరారీలో ఉన్న అతడ్ని అరెస్ట్ చేస్తామని పోలీస్ అధికారి తెలిపారు. వధువుకు, అతడి మధ్య ఏమైనా సంబంధం ఉందా? ఆమెపై ఎందుకు కాల్పులు జరిపాడు? ఆపై ఎందుకు ఆత్మహత్యకు ప్రయత్నించాడు? అన్న ప్రశ్నలపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామని చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Beauty parlour
- Bihar
- bride
- Cop
RELATED ARTICLES
తాజా వార్తలు
Breast Cancer | మహిళలు రోజూ వ్యాయామం చేస్తే రొమ్ము క్యాన్సర్ ముప్పు తగ్గుతుందా?
IND vs NZ T20I | న్యూజిలాండ్‌తో రెండో టీ20.. తుదిజట్టులోకి వైభవ్ సూర్యవంశీ..!
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
Siddipet | ఎనిమిది నెలలుగా మైనర్ బాలికపై గంజాయి బ్యాచ్ లైంగిక దాడి.. దసరా వేళ వెలుగులోకి!
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

