గుజరాత్ మాజీ హోంమంత్రి హరేనా పాండ్యాలా నన్నూ అంటునే.. మోదీ-అమిత్‌షాలపై సుబ్రమణ్యస్వామి అనుమానం
Subramanya Swamy | ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాలు తనకు కూడా హరేన్ పాండ్యాకు ఇచ్చిన ట్రీట్మెంటే ఇవ్వరని అశిస్తున్నా అంటూ
- బీజేపీ అగ్ర నాయకులపై ఆ పార్టీ ఎంపీ సుబ్రమణ్యస్వామి వ్యంగ్య కామెంట్స్
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాలు తనకు కూడా హరేన్ పాండ్యాకు ఇచ్చిన ట్రీట్మెంటే ఇవ్వరని అశిస్తున్నా అంటూ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు, ఆ బీజేపీ అగ్ర నాయకులిద్దరూ తనకు ఎంతిస్తే.. తాను కూడా అంతకు తగ్గకుండా తిరిగిస్తానని వ్యంగ్యంగానే హెచ్చరించారు. మోదీ, షాలు నా మీద కూడా హరేన్ పాండ్యా ప్లాన్ చేయరనుకుంటున్నా. ఒకవేళ అదే చేస్తారనుకుంటే నేను నా మిత్రులను అప్రమత్తం చేయాలి. ఒక్కటి గుర్తుంచుకోండి, వాళ్ల నుంచి నేను ఏది పొందినా తాను అంతకు తగ్గకుండా తిరిగి ఇచ్చేస్తా అని ఇవాళ తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ పెట్టారు.
మోదీ, అమిత్ షా ఇద్దరూ పార్టీలోని సీనియర్ నాయకులకు తగిన మర్యాద ఇవ్వడం లేదని స్వామి ఆరోపించారు. ఆరెస్సెస్‌లోని అగ్ర నాయకులను కూడా ఆ ఇద్దరు అమర్యాదగా చూస్తున్నారని మండిపడ్డారు. హరేన్ పాండ్యా 2003లో అహ్మదాబాద్‌లో హత్యకు గురయ్యారని, అప్పుడు ఆయన గుజరాత్ మాజీ హోంమంత్రి అని సుబ్రమణ్యస్వామి పేర్కొన్నారు. గోద్రా అల్లర్ల తర్వాత ప్రభుత్వం అనుసరించిన తీరుపై పాండ్యా అసంతృప్తి వ్యక్తం చేయడంతో ఆయనను పార్టీ నుంచి తొలగించారని, తర్వాత హత్యకు గురయ్యాడని తెలిపారు.
అయితే, తాను హరేన్ పాండ్యా హత్య గురించి మాట్లాడటం లేదని, ఆయనను పార్టీ నుంచి పక్కనపెట్టిన విషయం గురించి మాట్లాడుతున్నానని స్వామి క్లారిటీ ఇచ్చారు. కాగా, జడ్ కేటగిరీ ప్రొటెక్టీ అయిన సుబ్రమణ్యస్వామి వ్యక్తిగత నివాసం దగ్గర భద్రత సమస్య పరిస్కారంపై సమగ్ర అఫిడవిట్ దాఖలు చేయాలని ఈ ఉదయం కేంద్ర ప్రభుత్వాన్ని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. దాంతో స్వామి నివాసం వద్ద భద్రతను పునఃసమీక్షిస్తామని కేంద్రం తెలిపింది. సుబ్రమణ్యస్వామి తనకు ప్రభుత్వం కేటాయించిన బంగ్లాను ఖాళీచేసి తన వ్యక్తిగత ఇంట్లోకి మారాడు. ఆపై సెక్యూరిటీ విషయమై ఢిల్లీ హైకోర్టుకు వెళ్లారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
పానగల్ ఛాయా సోమేశ్వరాలయ అభివృద్ధికి రూ.20 కోట్లు మంజూరు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

