Woman Speaker | మిజోరం అసెంబ్లీకి తొలి మహిళా స్పీకర్.. టీవీ యాంకర్‌కు దక్కిన అవకాశం
Woman Speaker | అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడే ఈశాన్య రాష్ట్రమైన మిజోరాం రాజకీయాల్లో చారిత్రక ఘట్టం చోటుచేసుకుంది. 40 మంది సభ్యులున్న మిజోరాం అసెంబ్లీకి తొలిసారిగా ఓ మహిళ స్పీకర్‌గా ఎంపికయ్యారు. జోరమ్ పీపుల్స్ మూవ్మెంట్ నాయకురాలు, ఎమ్మెల్యే బారిల్ వన్నెహసాంగిని మార్చి 7న జరిగిన అసెంబ్లీ సెషన్లో స్పీకర్‌గా ఎంపికచేసుకున్నారు.
Woman Speaker: అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడే ఈశాన్య రాష్ట్రమైన మిజోరాం రాజకీయాల్లో చారిత్రక ఘట్టం చోటుచేసుకుంది. 40 మంది సభ్యులున్న మిజోరాం అసెంబ్లీకి తొలిసారిగా ఓ మహిళ స్పీకర్‌గా ఎంపికయ్యారు. జోరమ్ పీపుల్స్ మూవ్మెంట్ నాయకురాలు, ఎమ్మెల్యే బారిల్ వన్నెహసాంగిని మార్చి 7న జరిగిన అసెంబ్లీ సెషన్లో స్పీకర్‌గా ఎంపికచేసుకున్నారు.
మిజోరాం అసెంబ్లీకి ఇది ఒక చారిత్రక మైలురాయి అని రాష్ట్ర ముఖ్యమంత్రి, జోరమ్ పీపుల్స్ మూవ్మెంట్ అగ్రనేత లాల్దుహోమా అన్నారు. సాంప్రదాయ పరిమితులను దాటుకుని రాజకీయాల్లోకి వస్తున్న మహిళలకు ఈ మైలురాయి ఒక ప్రేరణగా నిలుస్తుందని చెప్పారు. రాష్ట్రంలో మరింత మంది మహిళలు రాజకీయాల్లోకి వచ్చేందుకు ఆమె మార్గం చూపారని పేర్కొన్నారు.
ఇటీవల జరిగిన మీజోరాం అసెంబ్లీ ఎన్నికల్లో ముగ్గురు మహిళలు శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు. వీరిలో జోరమ్ పీపుల్స్ మూవ్మెంట్ కి చెందిన వన్నెహసంగి ఒకరు. మిజో నేషనల్ ఫ్రంట్ అభ్యర్థి ఎఫ్ లాల్నున్మావియాపై ఆమె 9,370 ఓట్ల తేడాతో గెలుపొందారు. రాష్ట్రంలోనే అత్యంత పిన్న వయస్కురాలైన ఎమ్మెల్యేగా కూడా 32 ఏళ్ల బారిల్ వన్నెహసాంగి చరిత్ర సృష్టించారు.
రాజకీయ రంగంలోకి అడుగు పెట్టకముందు వన్నెహసాంగి ఐజ్వాల్ మున్సిపల్ కార్పొరేషన్లో కార్పొరేటర్‌గా పనిచేశారు. మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌లోని నార్త్ ఈస్టర్న్ హిల్ యూనివర్శిటీ నుంచి ఆర్ట్స్‌లో మాస్టర్స్ డిగ్రీ చేసిన ఆమె టెలివిజన్ యాంకర్‌గా పనిచేశారు. వన్నెహసాంగికి ఆకట్టుకునే సోషల్ మీడియా ఫాలోయింగ్ ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు 2.5 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
JIO IPO | దుమ్మురేపిన జియో ఐపీవో.. ముగిసిన మెగా పబ్లిక్ ఇష్యూ.. 22.19 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్
Flying Car India | ఇంజినీరు కాకున్నా ఎగిరే కారు తయారు చేశాడు.. ఉత్తరాఖండ్వాసి అద్భుతం!
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

