Supreme Court | సుప్రీంకోర్టు చారిత్రాత్మక నిర్ణయం.. తొలిసారిగా సిబ్బందికి రిజర్వేషన్లు..!
Supreme Court | 75 చరిత్ర సంవత్సరాల చరిత్ర కలిగిన దేశ సర్వోన్నత న్యాయస్థానం చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నది. తొలిసారిగా సిబ్బందికి రిజర్వేషన్లు అమలు చేయబోతున్నది. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల సిబ్బంది ప్రత్యక్ష నియామకం, పదోన్నతులను కల్పించేందుకు మొదటిసారిగా అధికారిక రిజర్వేషన్లు ప్రవేశపెట్టింది.
Supreme Court | 75 చరిత్ర సంవత్సరాల చరిత్ర కలిగిన దేశ సర్వోన్నత న్యాయస్థానం చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నది. తొలిసారిగా సిబ్బందికి రిజర్వేషన్లు అమలు చేయబోతున్నది. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల సిబ్బంది ప్రత్యక్ష నియామకం, పదోన్నతులను కల్పించేందుకు మొదటిసారిగా అధికారిక రిజర్వేషన్లు ప్రవేశపెట్టింది. దాంతో సుప్రీంకోర్టులో నాన్-జ్యుడీషియల్ పోస్టులకు ప్రత్యక్ష నియామకాలు, పదోన్నతుల్లో రిజర్వేషన్ల ప్రయోజనాన్ని పొందనున్నారు. సుప్రీంకోర్టు రిజర్వేషన్ విధానం 23 జూన్ 2025 నుంచి అమలులోకి తీసుకువచ్చింది. ఇది భారత సుప్రీంకోర్టులో పరిపాలనా పనితీరులో భారీ మార్పునకు సంకేతంగా నిలుస్తున్నది.
అయితే, ఈ రిజర్వేషన్లు న్యాయమూర్తులకు వర్తించదు. రిజిస్ట్రార్, సీనియర్ పర్సనల్ అసిస్టెంట్, అసిస్టెంట్ లైబ్రేరియన్, జూనియర్ కోర్ట్ అసిస్టెంట్, ఛాంబర్ అటెండెంట్ తదితర పోస్టులకు మాత్రమే రిజర్వేషన్ వర్తిస్తుంది. సుప్రీంకోర్టులో రిజర్వేషన్ కింద మూడు కేటగిరిలు ఉంటాయి. అవి ఎస్సీ, ఎస్టీ, నాన్ రిజర్వ్డ్. రిజర్వేషన్ల అమలుపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ మాట్లాడుతూ.. అన్ని ప్రభుత్వ సంస్థలు, వివిధ హైకోర్టుల్లో రిజర్వేషన్ విధానం వర్తిస్తే.. సుప్రీంకోర్టు మాత్రమే ఎందుకు మినహాయింపుగా ఉండాలి? మన విలువలు.. మన చర్యలకు అద్దం పట్టాలన్నారు. జూన్ 24న జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం, షెడ్యూల్డ్ కుల (ఎస్సీ) ఉద్యోగులకు సుప్రీంకోర్టులో 15 శాతం రిజర్వేషన్లు లభించనుండగా.. డ్యూల్డ్ తెగ (ఎస్టీ) వర్గానికి 7.5 శాతం రిజర్వేషన్లు అమలవుతాయి. రోస్టర్ లేదంటే రిజిస్టర్లో తప్పులు లేదా సరికాని వాటి గురించి ఉద్యోగులు ఎవరైనా అభ్యంతరాలు లేవనెత్తినట్లయితే వాటి గురించి రిజిస్ట్రార్ (రిక్రూట్మెంట్)కు తెలియజేయవచ్చని సర్క్యులర్ పేర్కొంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
చెకుముకి సైన్స్ సంబురాలు-2026 పోస్టర్ ఆవిష్కరణ
Narnoor | గోవర్ధన్ గుట్టపై ఆదివాసుల సాంప్రదాయ పూజలు
Women Professor | వీసీ అల్డాస్ జానయ్య వేధింపులకు మరో మహిళా ప్రొఫెసర్ కంటతడి.. వీడియో
Cop Dies After Pushed | పటాకులు కాల్చడంపై వాగ్వాదం.. పోలీస్ అధికారిని తోసేయడంతో మృతి
‘యూత్ డిక్లరేషన్ హామీలు అమలు చేయాలి’
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

