బెంగళూరు: హిందూ యువకుడు, బురఖా ధరించిన ముస్లిం యువతి స్కూటీపై కూర్చొన్నారు. నలుగురు ముస్లిం యువకులు వారి వద్దకు వచ్చారు. వేర్వేరు మతాలకు చెందిన ఇద్దరు కలిసి ఉండటంపై నిలదీశారు. వారిద్దరిని వేధించారు. (Hindu Man, Burqa-Clad Woman Harassed) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ సంఘటన జరిగింది. ఏప్రిల్ 9న చంద్రా లేఅవుట్ ప్రాంతంలో పార్క్ చేసిన స్కూటీపై హిందూ యువకుడు, బురఖా ధరించిన ముస్లిం యువతి కూర్చొన్నారు. ఇది చూసి నలుగురు ముస్లిం వ్యక్తులు వారి వద్దకు వచ్చారు. వేర్వేరు మతాలకు చెందిన వారిద్దరూ కలిసి ఉండటాన్ని నిలదీశారు. ‘బురఖా ధరించిన నువ్వు హిందూ అబ్బాయితో బైక్‌పై ఎందుకు కూర్చున్నావు?’ అని ఆమెను ప్రశ్నించారు. ‘నీకు సిగ్గు లేదా? కుటుంబ గౌరవం లేదా?’ అని తిట్టారు. కుటుంబ సభ్యుల ఫోన్ నంబర్ చెప్పాలని ముస్లిం మహిళను డిమాండ్ చేశారు. ఆమెను బెదిరించేందుకు వారు ప్రయత్నించారు.
కాగా, ఆ వ్యక్తి తన క్లాస్మేట్ అని ముస్లిం అమ్మాయి చెప్పింది. తన కుటుంబ సభ్యుల ఫోన్ నంబర్ ఇందుకు ఇవ్వాలని వారిని ప్రశ్నించింది. వేరే మతానికి చెందిన ఆ మహిళను ఎందుకు కలుస్తున్నావని హిందూ వ్యక్తిని వారు ప్రశ్నించారు. అతడిపై దాడికి ప్రయత్నించారు. దీనిని వీడియో రికార్డ్ చేశారు. వారిద్దరి పరువు తీసేందుకు ఈ వీడియో క్లిప్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
మరోవైపు ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ముస్లిం అమ్మాయి దీనిపై స్పందించింది. తనను, తన క్లాస్‌మేట్‌ను వేధించిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో ఆ వ్యక్తులను మొహ్సిన్, మన్సూర్, అఫ్రిది, వసీం ఖాన్‌గా గుర్తించారు. పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. మోరల్ పోలీసింగ్‌కు పాల్పడితే సహించేది లేదని పోలీస్ అధికారి హెచ్చరించారు.
Moral policing by Muslim goons in Bengaluru
This video is posted by muslim owned ancient time news channel.
If they occupy the mainstream media,imagine the condition of common HindusWhat kind of message are they giving to society with that news ? pic.twitter.com/xjp8LPijSZ
— DSH MAX (@team_dsh_1) April 9, 2025