M K Stalin: హిందీ-సంస్కృతం.. 25 ఉత్తరాది భాషలను నాశనం చేశాయి: సీఎం స్టాలిన్
M K Stalin: హిందీ భాషను ఎట్టి పరిస్థితిలో తమ రాష్ట్రంలో అమలు చేయబోమని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ స్పష్టం చేశారు. తమిళ భాషను, తమిళ సంస్కృతిని కాపాడుకునేందుకు పోరాటం చేస్తానన్నారు. హిందీ-సంస్కృతం ఆధిపత్యం వల్ల.. ఉత్తరాదికి చెందిన 25 ప్రాచీన భాషలు నాశనమైనట్లు ఆరోపించారు.
చెన్నై: హిందీ భాషకు వ్యతిరేకంగా తమిళనాడు తన పోరాటాన్ని ఉదృతం చేసింది. ఆ భాషను ఎట్టి పరిస్థితిలో అమలు చేయబోమని ఆ రాష్ట్ర సీఎం ఎంకే స్టాలిన్ స్పష్టం చేశారు. తమిళ భాషను, తమిళ సంస్కృతిని కాపాడుకునేందుకు పోరాటం చేస్తానన్నారు. హిందీ భాషను కచ్చితంగా నేర్చుకోవాలన్న నిబంధనను వ్యతిరేకిస్తున్నామని, హిందీ భాష ఓ మాస్క్ అయితే, సంస్కృతం ఓ కనిపించని ముఖం అన్నారు. పార్టీ కార్యకర్తలకు రాసిన లేఖలో ఆయన ఈ విషయాన్ని తెలిపారు.
మూడు భాషలు నేర్చుకోవాలని కేంద్ర సర్కారు కొత్తగా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ తెచ్చిన విషయం తెలిసిందే. అయితే కేంద్ర నిర్ణయాన్ని డీఎంకే వ్యతిరేకిస్తున్నది. బీహార్, యూపీ, మధ్యప్రదేశ్‌లో మాట్లాడే మిథిలీ, బ్రజ్‌భాషా, బుందేల్‌ఖండ్, అవధి లాంటి స్థానిక భాషలు.. హిందీ భాష ఆధిపత్యం వల్ల నాశనమైనట్లు స్టాలిన్ తన లేఖలో తెలిపారు. హిందీ-సంస్కృత భాషల ఆధిపత్యం వల్ల ఉత్తరాదికి చెందిన సుమారు 25 ప్రాచీన భాషలు అంతరించిపోయినట్లు స్టాలిన్ తన లేఖలో పేర్కొన్నారు. శతాబ్ధ కాలం నాటి ద్రవిడ ఉద్యమం వల్ల.. తమిళ భాష, సంస్కృతిని రక్షించుకునట్లు చెప్పారు.
మూడు భాషల పాలసీ షెడ్యూల్ ద్వారా.. చాలా వరకు రాష్ట్రాల్లో సంస్కృతాన్ని మాత్రమే ప్రమోట్ చేస్తున్నారని స్టాలిన్ ఆరోపించారు. బీజేపీ పాలిత రాజస్తాన్‌లో.. ఉర్దూ టీచర్లకు బదులుగా సంస్కృత టీచర్లను రిక్రూట్ చేస్తున్నట్లు చెప్పారు. ఒకవేళ తమిళనాడులో త్రిభాషా విధానాన్ని అమలు చేస్తే, అప్పుడు మాతృభాషని పట్టించుకోరు అని, భవిష్యత్తు అంతా సంస్కృతమే అవుతుందని స్టాలిన్ తెలిపారు. ద్రవిడ నేత, దివంగత మాజీ సీఎం సీఎన్ అన్నాదురై.. తమిళనాడులో ద్విభాషా విధానం అమలుకు ప్రాముఖ్యత ఇచ్చినట్లు చెప్పారు. హిందీ-సంస్కృతం అమలు వల్ల తమిళ సంస్కృతి నష్టపోతుందని ఆయన అంచనా వేసినట్లు స్టాలిన్ చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Scene | సూర్య ‘సీన్’ ఓటీటీ రిలీజ్ టైం ఫిక్స్ .. నెట్‌ఫ్లిక్స్‌లో ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ కానుందంటే!
Kamareddy | కామారెడ్డి జిల్లా జిల్లాలో విషాదం.. కుంటలో పడి తండ్రి, కూతురు మృతి
Vijay Sethupathi | విజయ్ సేతుపతికి అరుదైన గౌరవం.. తొలి భారతీయ నటుడిగా ఇంటర్నేషనల్ ఎమ్మీ అవార్డుల వేదికపై చరిత్ర!
KTR | ఒకే ఫ్రేమ్‌లో కేటీఆర్, సీఎం విజయ్, వైఎస్ జగన్.. ఫొటోలు వైరల్!
Cab Driver: భార్యను, ఆమె బంధువుల్లో ఆరుగుర్ని కడతేర్చిన క్యాబ్ డ్రైవర్
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

