Riniki Bhuyan Sarma: కాంగ్రెస్ ఎంపీపై 10 కోట్ల పరువునష్టం దావా వేసిన అస్సాం సీఎం భార్య
Riniki Bhuyan Sarma: కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గగోయ్‌పై అస్సాం సీఎం భార్య రినికి 10 కోట్ల పరువునష్టం కేసు దాఖలు చేశారు. ఫుడ్ ప్రాసెసింగ్ ప్రాజెక్టులో అవకతవకలు జరిగినట్లు రినికిపై కాంగ్రెస్ నేత ఆరోపణలు చేశారు. రినికి తరపున సీనియర్ న్యాయవాది దేవజిత్ సైకియా వాదిస్తున్నారు.
గౌహతి: అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ భార్య రినికి భుయాన్ శర్మ(Riniki Bhuyan Sarma).. కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గగోయ్‌పై పరువునష్టం కేసు దాఖలు చేశారు. తప్పుడు ఆరోపణలు చేసిన గగోయ్.. 10 కోట్లు చెల్లించాలంటూ ఆ కేసులో ఆమె డిమాండ్ చేశారు. ఫుడ్ ప్రాసెసింగ్ ప్రాజెక్టులో అవకతవకలు జరిగినట్లు రినికిపై కాంగ్రెస్ నేత ఆరోపణలు చేశారు. అస్సాం సీఎం భార్య తరపున సీనియర్ న్యాయవాది దేవజిత్ సైకియా వాదిస్తున్నారు. కామరూప్ మెట్రోపాలిటన్ సివిల్ కోర్టులో కేసు వేశారు. సెప్టెంబర్ 26వ తేదీన కేసును విచారించనున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి తమకు ఎటువంటి సబ్సిడీ అందలేదని సైకియా తన దావాలో తెలిపారు. అసలు సబ్సిడీ ఇచ్చేందుకు చేపట్టాల్సిన ప్రక్రియే జరగలేదన్నారు.
పీఎం కిసాన్ సంపద యోజన పథకం ద్వారా అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ భార్య రినికి భూయాన్ శర్మకు చెందిన కంపెనీకి రూ.10 కోట్లు అందినట్లు ఆరోపణలు ఉన్నాయి. కేంద్ర ఆహార శాఖ వెబ్సైట్లోనే దీనికి సంబంధించిన సమాచారం ఉంది. సంపద యోజన పథకం కింద సబ్సిడీతో కూడిన రుణం రూ.10 కోట్లు రినికి భూయాన్ శర్మకు చెందిన ‘ప్రైడ్ ఈస్ట్ ఎంటర్టైన్మెంట్స్ ప్రై.లి’ కంపెనీ అందుకున్నట్టు ఆ వెబ్సైట్ పేర్కొన్నది. ఈ వ్యవహారం అస్సాంలో రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నది.
నాగోన్ జిల్లా డారిగాజి గ్రామంలో 30 ఎకరాల వ్యవసాయ భూమిని పారిశ్రామిక భూమిగా అధికారులు వర్గీకరించారు. ఇది జరిగిన నెల రోజుల్లోనే సీఎం హిమంత బిశ్వ శర్మ కుటుంబ సభ్యులు ఆ భూమిని కొనుగోలు చేయటం సంచలనం రేపింది. ఈ వ్యవహారంపై న్యాయ విచారణ జరపాలంటూ గౌహతి హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలైంది. అయితే ఈ ఆరోపణల్ని అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ ఖండిస్తున్నారు. పీఎం కిసాన్ సంపద యోజన ద్వారా తన భార్యకు, ఆమెకు చెందిన కంపెనీకి ఎలాంటి నిధులు మంజూరు కాలేదని వివరణ ఇచ్చారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Weight Loss Medicine | బరువు తగ్గించే మందులను వైద్య సలహా లేకుండా వాడితే ప్రమాదం.. ఎందుకంటే..?
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
‘తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ప్రతీక కాళోజీ’
Rare opportunity | బేగంపేట విద్యార్థుకు అరుదైన అవకాశం.. రాష్ట్రపతి భవన్‌కు ఆహ్వానం
NTR | ఎన్టీఆర్ ‘గాడ్ ఆఫ్ వార్’పై క్లారిటీ.. నిర్మాతలతో త్రివిక్రమ్ క్రేజీ పిక్, రూమర్స్‌కు చెక్ పడ్టట్లే..!
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

