ఢిల్లీకి నీటి విడుదలపై హిమాచల్ యూటర్న్
దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర నీటి సంక్షోభం తలెత్తిన వేళ.. నీటి విడుదలపై హిమాచల్ సర్కారు యూటర్న్ తీసుకుంది. దీంతో సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ధిక్కారం కింద రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శిని పిలవాల్సి వస్తుందని హెచ్చరించింది.
- మిగులు జలాలే లేవని వెల్లడి
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర నీటి సంక్షోభం తలెత్తిన వేళ.. నీటి విడుదలపై హిమాచల్ సర్కారు యూటర్న్ తీసుకుంది. దీంతో సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ధిక్కారం కింద రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శిని పిలవాల్సి వస్తుందని హెచ్చరించింది. వడగాడ్పులు, నీటి సంక్షోభంతో సతమతమవుతున్న ఢిల్లీ ప్రజల కోసం నీటిని విడుదల చేయాలని హిమాచల్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఈ నెల 6న ఆదేశించింది. హిమాచల్‌లోని మిగులు జలాల నుంచి 137 క్యూసెక్కుల నీటిని పంపించాలని తెలిపింది.
ఈ నీరు సక్రమంగా ఢిల్లీకి చేరుకునే విధంగా సహకరించాలని హర్యానా ప్రభుత్వాన్ని కోరింది. హిమాచల్ సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు బుధవారం మీడియాతో మాట్లాడుతూ, తాము నీటిని విడుదల చేశామన్నారు. అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది సుప్రీంకోర్టులో గురువారం యూటర్న్ తీసుకున్నారు. తమ రాష్ట్రంలో మిగులు జలాలు లేవని చెప్పారు. గతంలో ఈ విషయాన్ని తాము సరైన విధంగా కోర్టు దృష్టికి తీసుకురాలేకపోయామన్నారు. సరైన స్టేట్మెంట్ను రికార్డు చేయాలని కోరారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

