కరోనా బారినపడ్డ హిమాచల్ సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు
Sukhwinder Singh Sukhu | హిమాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖుకు కరోనా వైరస్ సోకింది. రెండు రోజుల నుంచి స్వల్పంగా జ్వరం ఉండటంతో ఆయన
షిమ్లా: హిమాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖుకు కరోనా వైరస్ సోకింది. రెండు రోజుల నుంచి స్వల్పంగా జ్వరం ఉండటంతో ఆయన కరోనా పరీక్షలు చేయించుకున్నారు. ఈ పరీక్షల్లో ఆయనకు కరోనా పాజిటివ్ వచ్చింది. దాంతో ఇటీవల తనతో సన్నిహితంగా మెలిగిన పార్టీ నేతలు, కార్యకర్తలు, అధికారులు జాగ్రత్తలు పాటించాలని సుఖ్విందర్ సూచించారు.
ఇటీవల జరిగిన హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. మొత్తం 68 అసెంబ్లీ స్థానాలకుగాను 40 స్థానాల్లో గెలిచింది. దాంతో కాంగ్రెస్ అధిష్ఠానం సుఖ్విందర్ సింగ్ సుఖుకు ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టింది. అధికార బీజేపీ 25 స్థానాలకే పరిమితమై ఓటమి చవిచూసింది. ముఖ్యమంత్రి అయిన కొన్ని రోజులకే సుఖ్విందర్ కొవిడ్ బారిన పడటం గమనార్హం.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

