Suicide Cases | దేశంలో పది లక్షల మందికి.. 120 మంది ఆత్మహత్య..!
Suicide Cases | దేశంలో ఆత్మహత్యలకు సంబంధించిన గణాంకాలు దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయి. ఎన్సీఆర్బీ రికార్డుల ప్రకారం.. 2021 సంవత్సరాంలో 10లక్షల మందికి 120 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆత్మహత్యలు 2010 సంవత్సరంతో పోలిస్తే 6.1శాతం పెరిగింది. గతంతో పోలిస్తే ఒకే ఏడాదిలో ఇంత సంఖ్యలో ఆత్మహత్యలు జరుగడం ఇదే తొలిసారి. ఆత్మహత్యలు పెరుగుతుండడంతో సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. 2021లో దేశంలో యాక్సిడెంట్స్, ఆత్మహత్యలతో మరణాల డేటాను ఎన్సీఆర్బీ తయారు చేయగా.. కేంద్ర హోం మంత్రిత్వశాఖ విడుదల చేసింది. విద్యార్థుల్లో , చిన్న వ్యాపారవేత్తల్లో ఆత్మహత్య మరణాలు పెరగడం సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్నది. 2021లో అత్యధికంగా 1,64,033 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు.
అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే 7.2 శాతం పెరుగుదల నమోదైంది. అదే సమయంలో 2020 సంవత్సరంలో 1,53,052 మంది ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో 2019లో ఈ సంఖ్య దాదాపు 1.39లక్షలుగా ఉన్నది. అయితే, జనాభాపరంగా చూస్తే 2021లో ప్రతి పది లక్షల మంది జనాభాకు 120 మంది బలవన్మరణానికి పాల్పడుతున్నారు. 1967 నుంచి చూస్తే ఇప్పటి వరకు ఇదే అత్యధిక మరణాలు కావడం గమనార్హం. దేశంలో ఇప్పటివరకు నమోదైన రెండో అత్యధిక ఆత్మహత్య రేటు 2010లో ప్రతి మిలియన్ జనాభాకు 113 మరణాలుగా ఉండేది. అత్యల్ప-ఆదాయ వర్గాలు (సంవత్సరానికి ₹1 లక్ష కంటే తక్కువ సంపాదిస్తున్న వ్యక్తులు) ఆత్మహత్య ద్వారా సంభవించే మరణాలు మూడింట రెండు వంతుల మంది అత్యధికంగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారని నివేదిక పేర్కొంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

