Heatwave conditions | మరో 5 రోజులు భానుడి భగభగలే: ఐఎండీ వెల్లడి
Heatwave conditions | దేశంలో ఎండలు మండిపోతున్నాయి. జూన్ నెల సగం గడిచినా పగటి ఉష్ణోగ్రతలు ఏమాత్రం తగ్గలేదు. నైరుతి రుతు పవనాలు ఆలస్యం కావడంతో ఇంకా కొన్ని రాష్ట్రాల్లో భానుడి భగభగలు కొనసాగుతూనే ఉన్నాయి.
న్యూఢిల్లీ: దేశంలో ఎండలు మండిపోతున్నాయి. జూన్ నెల సగం గడిచినా పగటి ఉష్ణోగ్రతలు ఏమాత్రం తగ్గలేదు. నైరుతి రుతు పవనాలు ఆలస్యం కావడంతో ఇంకా కొన్ని రాష్ట్రాల్లో భానుడి భగభగలు కొనసాగుతూనే ఉన్నాయి. దేశంలోని పలు రాష్ట్రాల్లో మరో ఐదు రోజులు కూడా ఎండలు మండిపోతాయని భారత వాతావరణ కేంద్రం (India Meteorological Department) సోమవారం ప్రకటించింది.
ముఖ్యంగా ఛత్తీస్‌గఢ్, ఒడిశా, కోస్తాంధ్రాల్లో రాబోయే ఐదు రోజులపాటు ఎండలు మండిపోతాయని తెలిపింది. అదేవిధంగా ఉత్తరప్రదేశ్ దక్షిణ భాగంలోని వేర్వేరు ప్రాంతాల్లో, పశ్చిమబెంగాల్లోని గంగానది పరిసర ప్రాంతాల్లో, బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లో కూడా మరో ఐదు రోజులపాటు ఇప్పటిలాగే ఎండలు కొనసాగుతాయని పేర్కొంది. మధ్యప్రదేశ్‌లో మరో రెండు రోజులు భానుడి ప్రతాపం కొనసాగుతుందని ఐఎండీ చెప్పింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

