ఓవైపు వరద.. మరోవైపు వృత్తిధర్మం! నీటి ప్రవాహాన్ని దాటుకుని టీకాలు వేసిన సిబ్బంది
ఎదుటివారికి సహాయం అందించడం కోసం హెల్త్ వర్కర్లు ఎంతకైనా తెగిస్తారు. కొన్ని సందర్భాలలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రజలకు సాయపడిన హెల్త్ వర్కర్లను చూశాం. ఇంటింటికి కోవిడ్ వ్యాక్సిన్ వేసే క్రమంలో అలాంటి సాహసమే చేశారు జమ్మూకశ్మీర్‌లో ఇద్దరు హెల్త్ వర్కర్లు.

ఎదుటివారికి సహాయం అందించడం కోసం హెల్త్ వర్కర్లు ఎంతకైనా తెగిస్తారు. కొన్ని సందర్భాలలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రజలకు సాయపడిన హెల్త్ వర్కర్లను చూశాం. ఇంటింటికి కోవిడ్ వ్యాక్సిన్ వేసే క్రమంలో అలాంటి సాహసమే చేశారు జమ్మూకశ్మీర్‌లో ఇద్దరు హెల్త్ వర్కర్లు.
రాజౌరి జిల్లా ట్రల్లా గ్రామంలో వ్యాక్సిన్ వేయడానికి వచ్చిన హెల్త్ వర్కర్లు ఒక నదిని దాటాల్సి వచ్చింది. కానీ వరదల కారణంగా ఆ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఆ నది దాటితేనే గ్రామంలోకి వెళ్లి అక్కడి ప్రజలకు వ్యాక్సిన్ వేయవచ్చు. దీంతో తమ విధిని నిర్వర్తించడం కోసం పెద్ద సాహసమే చేశారు. ఉధృతంగా ప్రవహిస్తున్న ఆ నదిని చాలా కష్టంగా దాటుకుంటూ వెళ్లారు. ట్రల్లా గ్రామస్థులకు టీకాలు వేశారు. ట్రల్లా గ్రామంలోని ఆరోగ్య కేంద్రంలో పనిచేసే ఒక డాక్టర్ ఇదంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఆరోగ్య కార్యకర్తలు చేసిన ఈ సాహాసానికి సంబంధించిన వీడియోను ప్రముఖ వార్తా సంస్థ ఏఎన్ఐ తమ ట్విటర్లో పోస్టు చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.
#Watch J&K | Health workers cross a river to carry out door-to-door COVID19 vaccination in Rajouri district's Tralla village
— ANI (@ANI) July 10, 2021
(Video Source: Dr Iram Yasmin, In-charge, Tralla Health Centre) pic.twitter.com/884C36ZBhA
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Avocado | రోజూ అవకాడో, మామిడిపండ్లను తింటే గుండె పదిలం.. అధ్యయనంలో వెల్లడి..
Health Tips | ఒంటి నొప్పులా.. ఇన్ఫెక్షన్లు కూడానా.. సమస్య ఏదైనా పసుపుతో పరిష్కారం..!
Jensen Huang | ఎన్విడియా సీఈవో జెన్సన్ హువాంగ్ రాజీనామా..!
Crude oil tanker hit | యూఏఈ తీరంలో చమురు ట్యాంకర్‌పై దాడి.. 19 మంది భారతీయ నావికులు సురక్షితం
రేపటి నుండి ఎంజీయూలో దక్షిణ భారత చరిత్రకారుల సమాగమం
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

