Health Insurance | ఇక ఏ వయసు వారికైనా ఆరోగ్య బీమా.. వయో పరిమితి తొలగించిన ఐఆర్డీఏఐ
కొత్తగా ఆరోగ్య బీమా తీసుకునేందుకు ఉన్న 65 ఏండ్ల వయో పరిమితిని ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఐఆర్డీఏఐ) తొలగించింది. ఇక నుంచి ఏ వయసు వారైనా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకోవచ్చని స్పష్టం చేసింది.
- వాయిదా పద్ధతిలో ప్రీమియం చెల్లించే వెసులుబాటు
Health Insurance | న్యూఢిల్లీ, ఏప్రిల్ 21: కొత్తగా ఆరోగ్య బీమా తీసుకునేందుకు ఉన్న 65 ఏండ్ల వయో పరిమితిని ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఐఆర్డీఏఐ) తొలగించింది. ఇక నుంచి ఏ వయసు వారైనా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకోవచ్చని స్పష్టం చేసింది. ఇంతకాలం 65 ఏండ్ల దాటిన వారు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేందుకు వీలుండేది కాదు. ఈ నిబంధనను తొలగిస్తూ ఇటీవల ఐఆర్డీఏఐ గెజిట్ విడుదల చేసింది. ఏప్రిల్ 1 నుంచి ఏ వయసు వారైనా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చని పేర్కొన్నది. పిల్లలు, విద్యార్థులు, సీనియర్ సిటిజన్లు, ఇలా అన్ని వయసుల వారికి, గర్భిణుల కోసం ప్రత్యేక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలను అందించాలని ఇన్సూరెన్స్ కంపెనీలను ఐఆర్డీఏఐ ఆదేశించింది.
అనారోగ్య సమస్యలున్నా..
ముందే ఏమైనా అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు ఇవ్వాలని సైతం ఐఆర్డీఏఐ స్పష్టం చేసింది. ఇంతకాలం క్యాన్సర్, ఎయిడ్స్, గుండెజబ్బులు వంటి సమస్యలు ఉన్న వారికి కంపెనీలు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు ఇచ్చేవి కావు. కాగా, ఇన్సూరెన్స్ ప్రీమియం మొత్తాన్ని వాయిదాల పద్ధతిలో చెల్లించే అవకాశం కూడా పాలసీదారులకు ఇవ్వాలని ఐఆర్డీఏఐ ఆదేశించింది. ఆయుర్వేద, యోగా, నాచురోపతి, యునాని, సిద్ధ, హోమియోపతి చికిత్సకు కవరేజీలో ఎలాంటి పరిమితి విధించివద్దని, ఇన్సూరెన్స్ చేయించుకున్న మొత్తానికి కవరేజీ ఈ చికిత్సలకు కూడా ఇవ్వాలని స్పష్టం చేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shabbir Ali: భారత ఫుట్‌బాల్ జట్టు మాజీ కెప్టెన్‌పై తెలంగాణ ఫుట్‌బాల్ సంఘం సస్పెన్షన్
Roshan Kanakala | మరో డిఫరెంట్ జానర్‌తో రాబోతున్న రోషన్ కనకాల.. ఈసారి వీఐ ఆనంద్ కథతో కొత్త ప్రయోగం!
Upasana | దీపావళి వేడుకల్లో స్టార్ హీరోల భార్యల సందడి.. ఒకే ఫ్రేమ్‌లో ఉపాసన, స్నేహారెడ్డి, నమ్రత.. ఫొటోలు వైరల్!
Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో దీపావళి విషాదం.. 2 ప్రమాదాల్లో 12 మంది మృతి.. రెండు కుటుంబాలు బుగ్గి
Uttar Pradesh | యూపీలో మంటల్లో చిక్కుకున్న కారు.. చిన్నారి సహా ఆరుగురు సజీవదహనం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

