Brij Bhushan | బ్రిజ్ భూషణ్ సింగ్ ఏ ఒక్క అవకాశాన్నీ వదల్లేదు.. మహిళా రెజ్లర్లకు లైంగిక వేధింపులపై ఢిల్లీ పోలీసుల నివేదిక
Brij Bhushan | బీజేపీ ఎంపీ, భారత రెజ్లింగ్ సమాఖ్య (WFI) మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ అవకాశం దొరికిన ప్రతిసారీ మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించాడని ఢిల్లీ పోలీసులు ఆరోపించారు. అందుకు సంబంధించిన అన్ని ఆధారాలను సేకరించినట్లు ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టుకు పోలీసులు తెలిపారు.
న్యూఢిల్లీ: బీజేపీ ఎంపీ, భారత రెజ్లింగ్ సమాఖ్య (WFI) మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ అవకాశం దొరికిన ప్రతిసారీ మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించాడని ఢిల్లీ పోలీసులు ఆరోపించారు. అందుకు సంబంధించిన అన్ని ఆధారాలను సేకరించినట్లు ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టుకు పోలీసులు తెలిపారు. అదేవిధంగా మహిళా రెజ్లర్ల ఆరోపణలపై విచారణ కోసం కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ బ్రిజ్ భూషణ్‌కు క్లీన్ చిట్ ఇవ్వలేదనే విషయాన్ని పోలీసులు కోర్టులో ప్రస్తావించారు. ఈ మేరకు పోలీసులు ఢిల్లీ కోర్టుకు నివేదిక సమర్పించారు.
ఆసియా క్రీడల్లో పాల్గొనేందుకు తజకిస్థాన్ వెళ్లిన మహిళా రెజ్లర్లలో ఒకరిని బ్రిజ్ భూషణ్ తన గదికి పిలిచి గట్టిగా కౌగిలించుకున్నాడని, ఆమె ప్రతిఘటించడంతో ఓ తండ్రిలా తాను ఈ ఇలా చేశానని చెప్పాడని పోలీసులు తమ నివేదికలో పేర్కొన్నారు. అంతేగాక అనుమతి లేకుండా తన చొక్కాను బ్రిజ్ భూషణ్ పైకి ఎత్తాడని మరో మహిళా రెజ్లర్ ఫిర్యాదు చేసిందని, ఈ రెండు ఘటనలు బ్రిజ్‌భూషణ్ ఉద్దేశపూర్వకంగానే ఆ పనులు చేశాడనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని పోలీసులు కోర్టుకు తెలిపారు.
కాగా, కొన్ని నెలల క్రితం బ్రిజ్ భూషణ్ తమను లైంగికంగా వేధిస్తున్నాడని ఓ మైనర్‌తో పాటు ఏడుగురు మహిళా రెజ్లర్లు ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తర్వాత చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో మైనర్ రెజ్లర్ తన ఫిర్యాదును వెనక్కి తీసుకున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

