యూట్యూబ్‌పై రూ.75 లక్షలకు వ్యక్తి దావా.. లైంగిక యాడ్స్ వల్ల ఉద్యోగ పరీక్షలో విఫలమైనట్లు ఆరోపణ
అత్యంత దారుణమైన పిటిషన్లలో ఇది ఒకటని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. పబ్లిసిటీ కోసం వేసే ఇలాంటి పిటిషన్లు న్యాయవ్యవస్థ సమయాన్ని పూర్తిగా వృథా చేస్తాయని మండిపడింది.
న్యూఢిల్లీ: ఒక వ్యక్తి యూట్యూబ్‌పై రూ.75 లక్షలకు సుప్రీంకోర్టులో దావా వేశాడు. వీడియోల్లో వచ్చిన లైంగిక యాడ్స్ వల్ల తన దృష్టి మళ్లిందని, ఏకాగ్రత దెబ్బతిన్నదని, దీంతో ఉద్యోగ పరీక్షలో విఫలమైనట్లు ఆరోపించాడు. అలాగే సోషల్ మీడియాలో న్యూడ్ కంటెంట్‌పై నిషేధం విధించాలని కోరాడు. అయితే సర్వోన్నత న్యాయస్థానం ఆ వ్యక్తికి చీవాట్లు పెట్టింది. పనికిమాలిన పిటిషన్ వేసినందుకు రూ.25,000 జరిమానా కూడా విధించింది.
మధ్యప్రదేశ్‌కు చెందిన ఆనంద్ కిషోర్ చౌదరి, ఆ రాష్ట్ర పోలీస్‌లో చేరేందుకు పోటీ పరీక్షకు ప్రిపేర్ అయ్యాడు. ప్రిపరేషన్ కోసం యూట్యూబ్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నాడు. అయితే యూట్యూబ్ వీడియోల్లో వచ్చిన లైంగిక యాడ్స్ వల్ల తన ఏకగ్రత దెబ్బతిన్నదని, దృష్టి మళ్లిందని అతడు ఆరోపించారు. దీని వల్ల పోలీస్ ఉద్యోగ పరీక్షలో విఫలమైనట్లు పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో యూట్యూబ్ నుంచి రూ.75 లక్షల పరిహారం ఇప్పించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాడు.
కాగా, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఎస్కే కౌల్, ఏఎస్ ఓకాలతో కూడిన ధర్మాసనం ఆనంద్ కిషోర్ పిటిషన్‌ను శుక్రవారం తిరస్కరించింది. తన వాదన వినిపించేందుకు వ్యక్తిగతంగా కోర్టుకు హాజరైన అతడికి చీవాట్లు పెట్టింది. ‘ఇంటర్నెట్లో ప్రకటనలు చూసినందున నష్టపరిహారం కావాలా? దాని కారణంగా మీ దృష్టి మళ్లినందుకు పరీక్షలో విజయం సాధించలేకపోయారా?’ అని ప్రశ్నించింది. ‘అలాంటి ప్రకటనలు నచ్చకపోతే, చూడకండి’ అని బెంచ్ పేర్కొంది.
మరోవైపు రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 కింద దాఖలైన అత్యంత దారుణమైన పిటిషన్లలో ఇది ఒకటని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. పబ్లిసిటీ కోసం వేసే ఇలాంటి పిటిషన్లు న్యాయవ్యవస్థ సమయాన్ని పూర్తిగా వృథా చేస్తాయని మండిపడింది. అంతేగాక పిటిషనర్ ఆనంద్ కిషోర్‌కు తొలుత లక్ష జరిమానా విధించింది. అయితే కోర్టుకు క్షమాపణలు చెప్పిన అతడు తాను నిరుద్యోగినని, జరిమానా విధించవద్దని కోరాడు. స్పందించిన సుప్రీంకోర్టు, లక్షకు బదులు రూ.25,000 జరిమానా చెల్లించాలని అతడ్ని ఆదేశించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP leaders | మమ్మల్ని అరెస్టు చేసినా ఉద్యమం ఆగదు.. సౌరవ్ దాస్, రాంకా వెల్లడి.. క్రైమ్ బ్రాంచ్ ఎదుట హాజరు
అమెరికాలో భార్యను హత్య చేసిన భారత సంతతి వ్యక్తి.. ఐసీఈ ఏజెంట్లు ఆమెను కిడ్నాప్ చేసినట్లు ఆరోపణ
Rahul Gandhi | రాహుల్ గాంధీ వర్సెస్ ప్రియాంకా గాంధీ.. కాంగ్రెస్‌లో విబేధాలున్నాయంటున్న బీజేపీ
డేగలమడుగులో పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభం
‘బీఆర్ఎస్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించాలి’
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

