HDI | మానవ అభివృద్ధి సూచీలో దేశం పురోగతి.. భారత్ స్థానం ఎంతంటే..!
HDI | ప్రపంచ ‘మానవాభివృద్ధి సూచీ (HDI)’లో భారత్ (India) పురోగతి సాధించింది. 2023 ఏడాదికి సంబంధించి మొత్తం 193 దేశాల్లో భారత్‌కు 130వ స్థానం దక్కింది. అంతకుముందు ఏడాది అంటే 2022తో పోల్చుకుంటే మూడు స్థానాలు మెరుగుపడింది.
HDI : ప్రపంచ ‘మానవాభివృద్ధి సూచీ (HDI)’లో భారత్ (India) పురోగతి సాధించింది. 2023 ఏడాదికి సంబంధించి మొత్తం 193 దేశాల్లో భారత్‌కు 130వ స్థానం దక్కింది. అంతకుముందు ఏడాది అంటే 2022తో పోల్చుకుంటే మూడు స్థానాలు మెరుగుపడింది. 2022 ఏడాదికి సంబంధించిన మానవాభివృద్ధి సూచీలో భారత్ 133వ స్థానంలో నిలిచింది. ఆ తర్వాత ఏడాది మూడు స్థానాలు పురోగతి చెందింది.
ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం (UNDP) కి సంబంధించిన మానవాభివృద్ధి సూచీ-2025 నివేదిక మంగళవారం విడుదలైంది. ఈ నివేదికలో 2023 ఏడాదికి సంబంధించిన డేటాను ప్రకటించారు. అదేవిధంగా లింగ అసమానత సూచీలో కూడా భారత్ వృద్ధిని నమోదు చేసింది. 2023లో మొత్తం 193 దేశాల్లో భారత్ 102వ స్థానంలో నిలిచింది. అంతకుముందు ఏడాది అంటే 2022లో 166 దేశాల్లో భారత్ 108వ స్థానం దక్కించుకుంది. అంటే ఈ ఏడాది ఆరు స్థానాలు మెరుగుపడింది.
హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ – 2025 ప్రకారం భారతీయుల జీవిత కాలం కూడా మెరుగుపడింది. 2023లో భారత పౌరుడి సగటు జీవితకాలం 72 ఏళ్లుగా నమోదైంది. అంతకుముందు ఏడాది అంటే 2022లో భారత పౌరుడి సగటు జీవితకాలం 71.7 ఏళ్లుగా ఉంది. ఇప్పటికే వరకు ఇచ్చిన నివేదికల్లో ఇదే అత్యధిక సగటు జీవితకాలమని యూఎన్డీపీ తెలిపింది. 1990లో భారత పౌరుడి సగటు జీవితకాలం అతితక్కువగా 58.6 ఏళ్లు ఉందని వెల్లడించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dorothy | ‘ది ప్యారడైజ్’, ‘డోరోతి’.. ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన సినిమాలివే!
Sampoornesh Babu | మళ్లీ థియేటర్లలోకి సంపూర్ణేష్ బాబు ‘కొబ్బరి మట్ట’.. రీ రిలీజ్ డేట్ ఖరారు!
Indiramma Houses | ఇందిరమ్మ ఇల్లు మంజూరుకు లంచం డిమాండ్.. దళిత సర్పంచ్ మానస ఆవేదన
పోలీసు వ్యవస్థ పనితీరు అవగాహన కోసం ‘ఓపెన్ హౌస్’
Delhi school | స్కూల్లో కాలిన గాయాలతో మరణించిన 12వ తరగతి బాలిక.. అగ్నిప్రమాదంపై అనుమానాలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

