Farmers Protest : కర్నల్ లాఠీఛార్జీపై విచారణకు హర్యానా ప్రభుత్వం ఆదేశం
Farmers Protest : కర్నల్‌లో ఆందోళన చేస్తున్న రైతులపై పోలీసులు లాఠీఛార్జీ చేయడంపై విచారణకు హర్యానా ప్రభుత్వం ఆదేశించింది. పలు దఫాలుగా రైతు నేతలతో...

ఛండీగఢ్ : కర్నల్‌లో ఆందోళన చేస్తున్న రైతులపై (Farmers Protest) పోలీసులు లాఠీఛార్జీ చేయడంపై విచారణకు హర్యానా ప్రభుత్వం ఆదేశించింది. పలు దఫాలుగా రైతు నేతలతో సమావేశమై ఈ మేరకు విచారణకు ఆదేశించారు. రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి ఆధ్వర్యంలో విచారణ చేపట్టనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో వారం రోజులుగా చేస్తున్న ఆందోళనలను విరమించుకుంటున్నట్లు రైతులు ప్రకటించారు. కర్నల్‌లో రైతులపై గత నెల 28 న లాఠీఛార్జీ జరిగింది. ఈ ఘటనలో పదిమందికి పైగా రైతులు తీవ్రంగా గాయపడ్డారు.
కర్నల్‌లో బీజేపీ చేపట్టిన కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు బస్తారా టోల్ ప్లాజా వైపు పెద్ద సంఖ్యలో రైతులు రావడం మొదలుపెట్టారు. వీరిని అడ్డుకునేందుకు పోలీసులు లాఠీఛార్జీ చేయాల్సి వచ్చింది. ఈ ఘటనలో పలువురు రైతులు తీవ్రంగా గాయపడ్డారు. ఒక రైతు మరణించాడని రైతులు ఆరోపిస్తున్నారు. దీనిపై రైతుల సంఘాలు భగ్గుమన్నాయి. ఎక్కడికక్కడ ఆందోళనలకు పిలుపునివ్వడంతో హర్యానాలో పరిస్థితులు విషమంగా తయారయ్యాయి. దాంతో రైతు నేతలతో ప్రభుత్వం చర్చలు జరిపింది. రిటైర్డ్ హైకోర్ట్ న్యాయమూర్తితో విచారణ జరిపేందుకు ప్రభుత్వం అంగీకరించింది. నెల రోజుల్లోపు నివేదిక అందించాలని కూడా ప్రభుత్వం సూచించింది. మాజీ ఎస్డీఎం ఆయుష్ సిన్హాను సెలవుపై పంపనున్నట్లు ప్రభుత్వ అదనపు ప్రధాన కార్యదర్శి దేవేందర్ సింగ్ తెలిపారు.
లాఠీఛార్జీలో గాయపడి మరణించినట్లు చెప్తున్న రైతు కుటుంబంలో నుంచి ఇద్దరికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు సీనియర్ పోలీసు అధికారి ప్రకటించారు. దీంతో గత వారం రోజులుగా చేస్తున్న ఆందోళనను విరమించుకునేందుకు రైతు సంఘాలు నిర్ణయించాయి. రైతుల తలలు పగలగొట్టండి అని ఆదేశాలిచ్చిన ఎస్డీఎం ఆయుష్ సిన్హాను సస్పెండ్ చేయాలని రైతులు డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి..
18 ఏండ్లలో తొలిసారి 1000 మి.మీ వర్షపాతం
తీవ్రవాదంపై యుద్ధానికి రూ.585 లక్షల కోట్లు ఖర్చు
ఉగ్రవాదుల అమానుష దాడికి 20 ఏండ్లు పూర్తి
బెంగళూరులో ‘అప్పికో ఉద్యమం’.. ఎందుకంటే?
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
జర్నలిస్టు శంకర్‌కు 14 రోజుల రిమాండ్.. న్యూస్‌లైన్ ఎండీపై నాన్‌బెయిలబుల్ సెక్షన్ జోడించిన పోలీసులు
ఇందిరమ్మ చీరలకు బిల్లుల గండం.. పెండింగ్‌లో రూ.120 కోట్ల బకాయి
జ్ఞానేశ్ ను ఎవరూ కాపాడలేరు.. వేలాదిమందితో ఢిల్లీలో భారీ నిరసన ప్రదర్శన
భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

