తన రాజకీయ రంగ ప్రవేశంపై వివిధ రకాల ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ శనివారం కీలక ప్రకటన చేశారు. రాబోయే రోజుల్లో ఏ రాజకీయ పార్టీలో అయినా చేరితే, తప్పకుండా ముందుగానే ప్రకటిస్తానని అన్నారు. రాజకీయ చదరంగం గురించి మొత్తం తనకు తెలుసని అన్నారు. అయితే తాను పంజాబ్‌కు సేవ చేయాలనుకుంటున్నానని, అది రాజకీయాల ద్వారానా? లేదంటే మరో రంగం ద్వారానా? అన్న విషయంలో మాత్రం ఇప్పటి వరకూ ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని భజ్జీ పేర్కొన్నారు. అయితే వివిధ పార్టీల నుంచి ఆఫర్లు వస్తున్నాయన్న వార్తల్లో మాత్రం పూర్తిగా నిజముందని అంగీకరించారు. ఓ క్రికెటర్ హోదాలోనే పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు సిద్దూతో భేటీ అయ్యానని హర్భజన్ తెలిపారు.